అత్తాపూర్‌లో రౌడీషీటర్ల పాగా
ఖరీదైన స్థలం కనిపించిందంటే చాలు వారు గద్దల్లా వాలిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీసైనా ఆ స్థలాన్ని లాగేసుకుంటారు. వారికి అండగా ఎలాంటి శక్తులున్నాయో తెలియదు కానీ, ఖాళీ స్థలాల్లో దర్జాగా తిష్టవేసి అడ్డొచ్చిన వారిని బెదిరించి, కాదంటే అడ్డు తొ లగిస్తారు.
- కోట్ల రూపాయల స్థలం కబ్జాకు యత్నం
- తుపాకులు, కత్తులు, వేట కుక్కలతో పహారా
- 9మంది రౌడీషీటర్ల అరెస్టు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 21 (నమ స్తే తెలంగాణ): ఖరీదైన స్థలం కనిపించిందంటే చాలు వారు గద్దల్లా వాలిపోతారు. అవసరమైతే ప్రాణాలు తీసైనా ఆ స్థలాన్ని లాగేసుకుంటారు. వారికి అండగా ఎలాంటి శక్తులున్నాయో తెలియదు కానీ, ఖాళీ స్థలాల్లో దర్జాగా తిష్టవేసి అడ్డొచ్చిన వారిని బెదిరించి, కాదంటే అడ్డు తొ లగిస్తారు. కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని చేజిక్కించుకుంటారు. ఈ క్రమంలోనే రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్బర్‌హిల్స్‌లో ఉన్న ఖాళీ స్థలంపై వారి కన్ను పడింది. కోట్ల రూపాయల విలువైన 500 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు పథకం పన్నా రు. కొన్ని రోజుల క్రితం ఆ స్థలంలో తిష్టవేశా రు.
తుపాకి, కత్తులు వంటి మారణాయుధాలతోపాటు వేటకుక్కలను బోన్లో పెట్టి ఆ స్థ లంలోకి ఎవరూ రాకుండా రాత్రింబవళ్లు పహా రా కాస్తున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్వోటీ బృందం అక్కడకు చేరుకుని వారిని అరెస్ట్ చేసిం ది. 9 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేసి వారి నుంచి ఎయిర్ గన్, నాలుగు తల్వార్లు, కత్తులు, గొడ్డళ్లు, వేటకుక్కలతో కూడిన బోన్లను స్వా ధీనం చేసుకున్నట్టు రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవే టు స్థలాలను కబ్జా చేసి, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

