Kalyana Lakshmi | కల్యాణలక్ష్మి తులం బంగారం తరుగు!.. బడ్జెట్లో కానరాని కేటాయింపులు
కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందజేశారు. కానీ, ప్రస్తుత బడ్జెట్లో తులం బంగారాన్ని అందించేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు.
- పెండ్లినాడే అందిస్తామని నాడు హామీ
- పెండింగ్‌లో 82 వేల దరఖాస్తులు
Kalyana Lakshmi | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): కల్యాణలక్ష్మి పథకం కింద పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00,016 నగదుతోపాటు తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ అటకెక్కింది. అందుకు తాజా బడ్జెట్లో చేసిన కేటాయింపులే నిదర్శనం. కల్యాణలక్ష్మిపై పథకంపై అధికారులు ప్రభుత్వానికి ఇప్పటికే నివేదిక అందజేశారు. కానీ, ప్రస్తుత బడ్జెట్లో తులం బంగారాన్ని అందించేందుకు సరిపడా నిధులు కేటాయించలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన తరహాలోనే కల్యాణలక్ష్మి పథకం అమలు కోసం ఎస్సీలకు రూ.500 కోట్లు, ఎస్టీలకు రూ.260 కోట్లు, మైనార్టీలకు రూ.450 కోట్లు కేటాయించింది.
బీసీలకు గతంలో రూ.2వేల కోట్లు కేటాయించగా, కాంగ్రెస్ ప్రభుత్వం స్వల్పంగా రూ.175 కోట్లు పెంచి రూ.2,175 కోట్లు కేటాయించింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఏటా దాదాపు 1.50 నుంచి 2 లక్షల మంది ఆడబిడ్డలు ఆర్థిక సాయాన్ని అందుకుంటున్నారు. ఇప్పటికే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి 82 వేలకుపైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. అందులో ఈ ఆర్థిక సంవత్సరంలో వచ్చినవే 30 వేలకుపైగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన నిధులు నగదు సాయానికే సరిపోతాయి. తులం బంగారం హామీ అమలు అటకెక్కినట్టేనని అర్థమవుతున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

