కల్తీ కల్లు ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
కల్తీ కల్లు ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. వీరి మరణానికి కల్లులో ఆల్ఫ్రాజోలం కలపడమే కారణమని ఎక్సైజ్ అధికారులు తేల్చారు.
- 100 మందికి పైగా బాధితులకు చికిత్స
- కల్లులో ఆల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ
- నగరంలో 4 దుకాణాల లైసెన్సుల రద్దు
- మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల పరిహారం ఇవ్వాలి: కేటీఆర్
హైదరాబాద్ సిటీబ్యూరో/బాలానగర్/కేపీహెచ్‌బీ, జూలై 10 (నమస్తే తెలంగాణ): కల్తీ కల్లు ఘటనలో గురువారం నాటికి మృతుల సంఖ్య ఏడుకు చేరుకున్నది. వీరి మరణానికి కల్లులో ఆల్ఫ్రాజోలం కలపడమే కారణమని ఎక్సైజ్ అధికారులు తేల్చారు. ఈ మేరకు నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దు చేసినట్టు తెలిపారు. కూకట్‌పల్లిలోని సాయిచరణ్ కాలనీకి చెందిన నర్సమ్మ (54) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందింది. ఈ నెల 7న బాలానగర్ పరిధిలోని కల్లు దుకాణంలో నర్సమ్మ కల్తీ కల్లు సేవించి తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో చికిత్స నిమిత్తం బాధితురాలిని ఎర్రగడ్డ ఈఎస్ఐ దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందింది. బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 5 కల్లు దుకాణాల్లో ఈ నెల 7న దాదాపు 200 నుంచి 300 మంది కల్లు తాగారని, వారిలో ఇప్పటికే 100 మందికి పైగా వివిధ ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తున్నది. వీరిలో 38 మందిని గుర్తించి నిమ్స్ దవాఖానలో చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే. మిగతావారు కూకట్పల్లి, బాలానగర్, ఎర్రగడ్డ, సికింద్రాబాద్ ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
ఆల్ఫ్రజోలమే కారణం
బాలానగర్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని కల్లు దుకాణాల నిర్వాహకులు కల్లులో ఆల్ఫ్రాజోలం అనే మత్తు పదార్థాన్ని కలిపినట్ట ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. కల్తీకి పాల్పడిన నలుగురిని అరెస్టుచేసి, నాలుగు కల్లు దుకాణాల లైసెన్స్‌లను రద్దుచేశారు. హైదర్‌నగర్, హైదర్‌నగర్ అనుబంధ షాపు, ఎస్పీ నగర్ ఇందిరానగర్, భాగ్యనగర్ కల్లు కంపౌండ్లలో కల్లు శాంపిళ్లను సేకరించి, రీజినల్ కెమికల్ ల్యాబ్‌లో పరీక్షించగా, సదరు కల్లు దుకాణాల్లో ఆల్ఫ్రాజోలం కలిపినట్టు నిర్ధారణ జరిగిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
కల్తీకల్లు బాధితులను ఆదుకోవాలి
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. కుటుంబం కోసం కాయకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేని స్పష్టంచేశారు. ఇంతమంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకాపోవడం చాలా దారుణమని విమర్శించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని గురువారం ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
కల్తీ కల్లు బాధ్యులపై చర్యలు: రాజనర్సింహ
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న కల్తీ కల్లు బాధితులను గురువారం మంత్రి పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ ఘటనపై ప్రభుత్వం విచారణ చేపట్టిందన్నారు. 31 మంది నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.
రేవంత్‌రెడ్డీ.. పేదలంటే అలుసెందుకు?:దాసోజు
హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ ): ‘రేవంత్‌రెడ్డీ.. నీకు పేదలంటే అంత అలుసా? నగరంలో యథేచ్ఛగా కల్తీకల్లు విక్రయాలు జరుగుతుంటే, ఆ కల్లు తాగి పేదలు చనిపోతున్నా పట్టదా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్ర భుత్వంలో కల్తీ కల్లు విక్రయాలు 90 శా తం పెరిగాయని ఆరోపించారు. అక్రమ దందాలో కాంగ్రెస్ నేత ప్రమేయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Calling Name Presentation: ఫోన్ స్క్రీన్‌పై ఇక పేరు కూడా డిస్ప్లే అవుతుంది.. నవంబర్ ఒకటి నుంచి తప్పనిసరి
Tuni Chairperson | తునిలో జనసైనికులకు షాక్.. చైర్పర్సన్ అభ్యర్థిగా టీడీపీ నుంచి వచ్చిన నేత!
Bhatti vs Revanth | భట్టి వర్సెస్ రేవంత్.. ముదురుతున్న వివాదం.. విద్యుత్ అధికారులపై సీఎం వ్యాఖ్యలతో కలకలం
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

