చేనేతకు 73 కోట్లు విడుదల

- ఆ రంగాన్ని సంస్థాగతంగా బలోపేతం చేస్తున్నాం
- కార్మికుల నెలవారీ ఆదాయం రూ.15 వేలు మించింది
- చేనేతపై సమీక్షలో పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): చేనేత రంగానికి చెందిన వివిధ పథకాల కోసం ప్రభుత్వం రూ.73.42 కోట్లు విడుదలచేసింది. హాంక్ నూలు, రంగులకు 20 శాతం సబ్సిడీ, పావలా వడ్డీ రుణాలు, మారెటింగ్ ప్రోత్సాహక పథకం, టెసో ఎక్స్ గ్రేషియాలు, చేనేత మిత్ర, క్యాష్ క్రెడిట్ రుణాలు, నేతన్నకు చేయుత తదితర పథకాలకు ఈ నిధులను ఖర్చుచేస్తారు. ఈ పథకాలపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పథకాల ద్వారా చేనేత కార్మికుల ఆదాయం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం నేతన్నల నెలవారీ ఆదాయం రూ.15 వేలకు మించిపోయిందని తెలిపారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని సంస్థాగతంగా, నిర్మాణాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన చేనేత సంక్షేమ పథకాల వల్ల ఆ రంగంలోని కార్మికులు, అనుబంధ కార్మికుల ఆదాయాలు పెరిగి వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని తెలిపారు. తాజాగా విడుదలచేసిన నిధులతో చేనేత కార్మికులకు ఏడాదంతా పని దొరుకుతుందని చెప్పారు. సమావేశంలో చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజా రామయ్యర్‌తోపాటు ఆ శాఖకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
నిధుల విడుదలపై హర్షం
చేనేత పథకాలకు నిధుల విడుదలపై మాజీ మంత్రి ఎల్ రమణ, టీఆర్ఎస్ నాయకులు కర్నాటి విద్యాసాగర్, యర్రమాద వెంకన్న నేత తదితరులు హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రప్రభుత్వ పథకాలమూలంగా గతంలో వలస వెళ్లిన అనేకమంది నేత కార్మికులు సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారని పేర్కొన్నారు. బీటెక్, ఎంటెక్ వంటి కోర్సులు చదివిన యువత సైతం చేనేతరంగంలో ఉపాధి వెతుక్కోవడం గొప్ప మార్పని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు చేనేత సమాజం ఎప్పటికీ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- hand looms
- Handloom
- harish rao
- KTR
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగుల చవితి వేడుకల్లో ముస్లిం మహిళల పూజలు
కాళోజీకి ఘన నివాళి.. న్యాయవాదుల రక్తదానం
Ex-Minister Thalasani | గన్నవరం ఎయిర్‌పోర్టులో మాజీ మంత్రి తలసానికి ఘన స్వాగతం
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

