సన్నకారు రైతులకు అండగా రైతుబంధు
ఎంతో ఉన్నతాశయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేసేవారి నోటికి తాళం పడింది.
- ప్రతిపక్షాల నోటికి తాళం వేసిన గణాంకాలు
- బురదజల్లే వారికి చెంపపెట్టు ఈ వాస్తవాలు
- లబ్ధిదారుల్లో బీసీ,ఎస్సీ,ఎస్టీ రైతులే అధికం
- 65 లక్షలలో బీసీ,ఎస్సీ,ఎస్టీలు 51.59 లక్షలు
- రైతుబంధు నిధుల్లో 70శాతం వీరికే పంపిణీ
- చిన్న, సన్నకారు రైతులకు అండగా రైతుబంధు
- 60 లక్షల మందికి ఐదెకరాల లోపే భూమి
- తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదిక
హైదరాబాద్, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఎంతో ఉన్నతాశయంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకంపై నిజానిజాలు తెలుసుకోకుండా విమర్శలు చేసేవారి నోటికి తాళం పడింది. పెద్ద రైతులకు కట్టబెట్టడానికే ఈ పథకమంటూ ఆరోపిస్తున్న వారికి గణాంకాలు చెంపపెట్టుగా మారాయి. ఈ పథకం ద్వారా అత్యధికంగా (సుమారు 80శాతం) లబ్ధిపొందుతున్నది ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు చెందిన చిన్న,సన్నకారు రైతులేనన్నది స్పష్టమయ్యింది. రైతుబంధు నిధుల్లో అధిక భాగం ఈ వర్గాల రైతులకే అందుతున్నాయి. మొత్తం రైతుల్లో ఐదెకరాలలోపు గల చిన్న రైతులే 91.33 శాతమని తేటతెల్లమైంది. తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ ఆబ్స్ట్రాక్ట్ నివేదికలో ఈ విషయాలే వెల్లడయ్యాయి. బడుగు రైతులకు నిజమైన బంధువుగా రైతుబంధు నిలుస్తున్నది. ఈ పథకం కింద ఐదేండ్లలో రూ.65,501 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది.
80శాతం బడుగులు, 91శాతం బక్క రైతులు
గత వానకాలం రైతుబంధు పంపిణీ లెక్కలను పరిశీలిస్తే అందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ సీజన్లో మొత్తం 65 లక్షల మంది రైతులకు ప్రభుత్వం రూ.7,434.54 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసింది. ఈ మొత్తం రైతుల్లో 80శాతం బడుగు వర్గాలకు చెందిన రైతులుండగా, 91.33 శాతం చిన్న సన్నకారు రైతులు. మొత్తం 65లక్షల మంది లబ్ధిదారుల్లో 51.59 లక్షల మంది(80శాతం) బీసీ,ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారే కావడం గమనార్హం. మొత్తం నిధుల్లో ఈ మూడు వర్గాల వారికే ఏకంగా రూ.5,214.39 కోట్లు వారి ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్నది. ఇక ప్రభుత్వం భారీ సంఖ్యలో పెద్ద రైతులకు రైతుబంధు నిధులు ఇస్తున్నదంటూ ప్రతిపక్షాలు రాద్ధాం తం చేస్తున్నాయి. కానీ వాస్తవ లెక్కలను పరిశీలిస్తే మాత్రం లబ్ధిదారుల్లో చిన్న సన్నకారు రైతులే అధికం.
మొత్తం లబ్ధిదారుల్లో అన్ని వర్గాలకు చెందిన ఐదెకరాల లోపు భూమి గల సన్నకారు రైతులే 59.36 లక్షల మంది (91.33శాతం). 5 నుంచి 10 ఎకరాలలోపు గల రైతులు 7.28శాతం కాగా 10 నుంచి 25 ఎకరాల రైతులు 1.30శాతం, 25 ఎకరాలకు పైగల రైతులు కేవలం 0.09శాతం మాత్రమే ఉన్నట్లు గణాంకాలు నిరూపిస్తున్నాయి. ఇక రెండున్నర ఎకరాల్లోపు భూమి గల రైతులు మొత్తం 47.86 లక్షలుంటే, ఇందులో బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల రైతులు 40.09 లక్షల మంది ఉన్నట్టు లెక్కతేలింది. ఇక మొత్తం 1.48 కోట్ల ఎకరాల భూమి ఉంటే ఇందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు చెందిన రైతులదే 1.04 కోట్ల ఎకరాలు ఉండడం గమనార్హం. రైతుబంధు పథకం బడుగు, బలహీన వర్గాల రైతులకు ఏ విధంగా భరోసా ఇస్తుందో చెప్పడానికి ఈ లెక్కలే సాక్ష్యం.


ముఖ్య వివరాలు…
- మొత్తం 65 లక్షల మంది లబ్ధిదారుల్లో 51.59 లక్షల మంది(80శాతం) బీసీ,ఎస్సీ,ఎస్టీ రైతులు.
- మొత్తం 1.48 కోట్ల ఎకరాల భూమి ఉంటే ఇందులో ఎస్సీ,ఎస్టీ,బీసీ వర్గాలకు చెందిన రైతులదే 1.04 కోట్ల ఎకరాలు.
- మొత్తం రైతుబంధు నిధులు రూ.7,434.54 కోట్లు కాగా, అందులో రూ.5,214.39 కోట్లు ఎస్సీ,ఎస్టీ,బీసీ రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నది.
- అన్ని వర్గాల్లో ఐదెకరాల లోపు భూమి గల రైతులు 59.36 లక్షల మంది(91.33 శాతం).
- రెండున్నర ఎకరాల్లోపు భూమి గల రైతులు మొత్తం 47.86 లక్షలు ఉంటే ఇందులో బీసీ,ఎస్సీ,ఎస్టీ వర్గాల రైతులు 40.09 లక్షల మంది ఉన్నారు.
- మొత్తం లబ్ధిదారుల్లో అన్ని వర్గాలకు చెందిన ఐదెకరాల లోపు భూమి గల సన్నకారు రైతులు 59.36 లక్షల మంది(91.33శాతం) ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా డాన్సర్స్ యూనియన్ నూతన కమిటీ ఎంపిక
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

