Neolithic celts | హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): నగరంలోని జూబ్లీహిల్స్ పరిధి బీఎన్ఆర్ హిల్స్ వద్ద గల తాబేలు గుండు కింద కొత్త రాతియుగపు ఆనవాళ్లను గుర్తించినట్టు పురావస్తు పరిశోధకులు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
జూబ్లీహిల్స్ పరిసరాల్లోని విచిత్ర రాతి ఆకారాల సందర్శనలో భాగంగా శనివారం తాబేలుగుండును పరిశీలించారు. దీని కింద రెండు కొత్త రాతియుగపు రాతి గొడ్డళ్లు కనిపించాయని తెలిపారు. దీన్ని బట్టి హైదరాబాద్ నగరానికి 6 వేల ఏండ్ల చరిత్ర ఉన్నదని తెలుస్తున్నదని పేర్కొన్నారు.