రెండో విడత గొర్రెల పంపిణీకి రూ. 6 వేల కోట్లు : సీఎం కేసీఆర్
గొర్రెల పంపిణీ | తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని

హైదరాబాద్ : తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అందులో భాగంగా అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బీసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
రెండో విడత గొర్రెల పంపిణీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే చేపట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులను ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా రూ. 5 వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేపట్టగా.. అద్భుతమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. రెండో విడత గొర్రెల పంపిణీ కోసం రూ. 6 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఈ నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం కొనసాగిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం స్పష్టం చేశారు. దాంతో పాటు యూనిట్ (20+1) ధరను పెంచాలని సీఎం నిర్ణయించారు.
కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తాం
నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామంగా కృషి చేస్తోంది అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని కేసీఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dharman | అఫిషీయల్.. రజనీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల!
Harish Rao | ప్రతిపక్షాలు మాత్రం కదిలితే హౌస్ అరెస్ట్.. రేవంత్ మరి ఈ పిల్లల బాధలు పట్టిలేదా..? : హరీశ్ రావు
Hatah | కిరణ్ అబ్బవరం ‘హతః’ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Union Cabinet | అగ్నివీర్లకు కేంద్ర సర్కారు గుడ్ న్యూస్.. పదవీకాలం రెండేళ్లు పొడిగించాలని క్యాబినెట్ నిర్ణయం..!
Dhinidhi Desinghu | యూత్ ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో భారత్‌కు తొలి పతకం అందించిన ధినిధి దేశింగు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

