Medaram Jathara | మేడారానికి 6 వేల బస్సులు.. ఈ నెల 18 నుంచి 25 వరకు సేవలు
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.
- 16న మేడారంలో బేస్‌క్యాంప్
- భక్తులకు ఇబ్బంది లేకుండా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు
Medaram Jathara | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది. మేడారం జాత ర 21 నుంచి 24 వరకు జరుగనుండగా, భక్తుల రద్దీ దృష్ట్యా ఈ నెల 18 నుంచి 25 వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్టు తెలిపింది. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమక్క-సారలమ్మ జాతర సందర్భంగా టీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను ఉన్నతాధికారులతో కలిసి సోమవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పరిశీలించినట్టు ఆ సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.
16న మేడారంలో టీఎస్ఆర్టీసీ బేస్‌క్యాంప్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. మేడారం జాతరలో దాదాపు 14 వేల మంది ఆర్టీసీ సిబ్బంది విధులు నిర్వహిస్తారని చెప్పారు. 30 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నామని, భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల నుంచి మేడారానికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఆయా జిల్లాల భక్తులకు సరిపడా బస్సులు ఏర్పాటు చేస్తామని సజ్జనార్ చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. రైలింగ్‌ను ఢీకొట్టిన కారు, ఐదుగురికి గాయాలు
BJP MLA: బాణాసంచా పేల్చితే.. అనేక వ్యాధులు దూరం : బీజేపీ ఎమ్మెల్యే
Yadagirigutta | యాదగిరిగుట్టలో వైభవంగా స్వాతి నక్షత్ర వేడుకలు
AK 47 Collections | భారీ నష్టాల దిశగా వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’.. 10 రోజుల కలెక్షన్లు ఎంతంటే?
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

