అక్రమంగా తరలిస్తున్న రూ.6 లక్షల విలువైన మద్యం పట్టివేత

రంగారెడ్డి : రెండు వాహనాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను హయత్‌నగర్ పోలీసులు శనివారం స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కొహెడ్ ఔటర్ రింగ్‌రోడ్డు వద్ద జాతీయ రహదారి 65పై పోలీసులు తనిఖీలు చేపట్టారు. విజయవాడ వైపు వెళ్తున్న కారు, ఆటోలో 600 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న దామోదర్, హరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా తెలంగాణలో మద్యం కొనుగోలు చేసి ఆంధ్రాలో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు చెప్పారు. ఏపీతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు తక్కువ. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 6 లక్షల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

