58.92 కోట్ల జరిమానా

- కరోనా రూల్స్ పట్టనివారి నుంచి వసూలు
- హైకోర్టుకు నివేదించిన రాష్ట్ర ప్రభుత్వం
- ఆర్టీపీసీఆర్ పరీక్షలు పెంచాలని కోర్టు ఆదేశం
హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదుచేసి రూ.58.92 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేసినట్టు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. కరోనాపై దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై గురువారం చీఫ్ జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారించింది. ఈ పిల్స్‌లో డీజీపీ, పబ్లిక్‌హెల్త్ డైరెక్టర్లు వేర్వేరుగా అందజేసిన నివేదికల్లోని అంశాలను పరిశీలించింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై పోలీసులు కఠినంగా స్పందిస్తున్నారని.. డీజీపీ కౌంటర్పిటిషన్లో పేర్కొన్నారు. మాస్కులు పెట్టుకోని 8,417 మందిపై 1,64,467 కేసులు, భౌతికదూరం పట్టని 2,456 మందిపై, గుమిగూడటంపై 322 కేసులు, పాన్, గుట్కా, పబ్లిక్‌గా మద్యం తాగడంపై 27,023 కేసులు నమోదుచేసి, 62,220 మందిని అరెస్టు చేశారని ఏజీ బీఎస్‌ప్రసాద్ వివరించారు. వీరినుంచి రూ.58.92 కోట్లు జరిమానాగా వసూలు చేసినట్టు చెప్పారు. వీటిని పరిశీలించిన ధర్మాసనం కేసుల సంఖ్య పెంచాలని పోలీసులను ఆదేశించింది. కరోనా కట్టడికి ఆర్టీపీసీఆర్ పరీక్షల సంఖ్య పెంచాలని కోరింది.
కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేయాలి
అంటువ్యాధుల కట్టడికి ప్రభుత్వం వైద్యులతో కూడిన కమిటీలు వేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచుతామన్న హెల్త్ డైరెక్టర్ హామీని అమలుచేయాలని సూచించింది. సినిమాహాళ్లు, మాల్స్, క్లబ్బులు, వైన్‌షాపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని తెలిపింది. యువతను కట్టడి చేయాలని పేర్కొన్నది. మైక్రో కంటైన్మెంట్, కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటుచేయాలని చెప్పింది. పెండ్లిం డ్లకు 250 మంది దాటకుండా చూడాలని సూచించింది. బంగారం కంటే విలువైన వ్యాక్సినేషన్ పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, వృథా కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను అమలుచేస్తున్నామని, వైరస్‌కట్టడికి అన్నిస్థాయిల్లో ప్రభు త్వం చర్యలు తీసుకుంటున్నదని ఏజీ బీఎస్ ప్రసాద్ వివరించారు.
హెచ్చార్సీలో కేసుల విచారణ వాయిదా
ప్రత్యేక ప్రతినిధి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో రెగ్యులర్ కేసుల విచారణను వాయిదా వేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ నిర్ణయించింది. ఈ నెల 12 నుంచి 30 వరకు జ్యుడిషియల్ హియరింగ్‌లను రద్దు చేసింది. ప్రజలనుంచి వచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాలను వ్యక్తిగతంగా లేదా పోస్టుద్వారా తీసుకోవచ్చని కమిషన్ సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

