కథాంశాల ఎంపికలో సీనియర్ నాయికలు కొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. పోటీని తట్టుకొని నిలదొక్కుకోవాలంటే పాత్రలపరంగా ప్రయోగాలకు సిద్ధపడుతున్నారు. తాజాగా చెన్నై సొగసరి రెజీనా గూఢచారి ఏజెంట్గా విభిన్నమైన పాత్రలో కనిపించనుంది. ఆమె నటిస్తున్న తాజా తమిళ చిత్రం ‘బోర్డర్’. అరివాజగన్ దర్శకుడు. ఇందులో రెజీనా ‘రా’ ఏజెంట్గా శక్తివంతమైన పాత్రను పోషిస్తోంది. ఉగ్రవాద అంశాన్ని చర్చిస్తూ దేశభక్తి ప్రధానంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాతృభూమి కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే గూఢచారిగా రెజీనా పాత్ర భిన్న కోణాల్లో సాగుతుందని తెలిపింది. ఆమెపై భారీ యాక్షన్ ఘట్టాల్ని కూడా చిత్రీకరించబోతున్నారట. వాటికోసం రెజీనా ప్రత్యేక శిక్షణ తీసుకుందని చిత్రబృందం తెలిపింది. ఇప్పటివరకు తన కెరీర్లో లభించిన ఛాలెంజింగ్ రోల్ ఇదని రెజీనా ఆనందం వ్యక్తం చేసింది.