Cigarette Smoking | కొంపలు కాల్చుతున్న ‘సిగరెట్’.. కేర్లెస్ స్మోకింగ్‌తో పెరుగుతున్న అగ్నిప్రమాదాలు..
‘కేర్లెస్ స్మోకింగ్' వల్ల పెరుగుతున్న అగ్నిప్రమాదాలకు అంతేలేకుండా పోతున్నది. పొగతాగేవారి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. చుట్ట, బీడీ, సిగరెట్.. ఏదైతేనేం? తాగిన తర్వాత దానిని పూర్తిగా ఆర్పివేయకుండా పడేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
- తాగిపడేసిన పీకలతోనే 49% అగ్నిప్రమాదాలు
- కోట్లాది రూపాయల ఆస్తి బుగ్గిపాలు
- నిర్లక్ష్యం వీడాలంటున్న అగ్నిమాపకశాఖ
Cigarette Smoking | హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ‘కేర్లెస్ స్మోకింగ్’ వల్ల పెరుగుతున్న అగ్నిప్రమాదాలకు అంతేలేకుండా పోతున్నది. పొగతాగేవారి నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నది. చుట్ట, బీడీ, సిగరెట్.. ఏదైతేనేం? తాగిన తర్వాత దానిని పూర్తిగా ఆర్పివేయకుండా పడేయడం వల్ల జరుగుతున్న ప్రమాదాల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది.
తెలంగాణలో గత ఆరేండ్లలో ఇలాంటి ‘కేర్లెస్ స్మోకింగ్’ వల్ల ఏకంగా 49 శాతం అగ్నిప్రమాదాలు సంభవించాయంటే వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. మొత్తం ప్రమాదాల్లో వీటి సంఖ్య 46 శాతం కాగా, ఎలక్ట్రిక్ ఆధారిత ప్రమాదాలు 31 శాతం. గ్యాస్/బొగ్గు కారణంగా జరుగుతున్న ప్రమాదాలు నాలుగుశాతం కాగా, ఇతర వాటివల్ల 16 శాతం ప్రమాదాలు సంభవించినట్టు అగ్నిమాపకశాఖ గణాంకాలు చెప్తున్నాయి. కేర్లెస్ స్మోకింగ్ వల్ల అవుట్డోర్ స్టోరేజీలో 36శాతం ప్రమాదాలు జరిగితే, మరో 36శాతం ఇండ్లలో జరిగాయి. 18 శాతం ప్రమాదాలు వ్యవసాయ క్షేత్రాల్లో, 10శాతం ఇతర ప్రాంతాల్లో జరిగాయి.
ఐదేండ్లలో 5,142 మంది సేఫ్
అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్న వారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి రక్షిస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. వీరి సాహసోపేత ప్రయత్నాల కారణంగా ప్రమాదాల నుంచి ఎక్కువమంది బయటపడగలుగుతున్నారు. 2018 నుంచి 2023 చివరి వరకు 5,142 మంది ప్రాణాలను రక్షించారు. సుమారు రూ.6వేల కోట్లకుపైగా ఆస్తి బుగ్గిపాలు కాకుండా కాపాడారు. రాష్ట్రంలో 137 శాశ్వత అగ్నిమాపక కేంద్రాలు ఉండగా, మరో 9 ఫైర్ అవుట్‌పోస్ట్‌లు ఉన్నాయి. మొత్తంగా 146 అగ్నిమాపక కేంద్రాల్లో 2,734 మంది సిబ్బంది ఉన్నారు. 454 అగ్నిమాపక వాహనాలతో వీరు విధులు నిర్వర్తిస్తున్నారు. అగ్నిమాపకశాఖను మరింత పటిష్టం చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఆరేండ్లలోనే రూ.97.04 కోట్లు కేటాయించింది. అగ్నిమాపకశాఖ నిరుడు 10 వేలకుపైగా ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, మాక్‌డ్రిల్స్ నిర్వహించడం వల్ల అగ్నిప్రమాదాలు బాగా తగ్గుముఖం పట్టాయి.
నిర్లక్ష్యం వీడండి.. బాధ్యతగా ఉండండి
కేర్లెస్ స్మోకింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి ధూమపానం చేసేవారు నిర్లక్ష్యం వీడాలి. తాగిన తర్వాత సిగరెట్, చుట్ట, బీడీని పూర్తిగా ఆర్పివేయాలి. కాదని నిర్లక్ష్యంగా పడేస్తే తీరని నష్టం జరుగుతుంది. అవగాహన కార్యక్రమాల వల్ల నిరుడు అగ్నిప్రమాదాల సంఖ్య భారీగా తగ్గింది. ఎక్కువమందిని రక్షించగలిగాం. చిన్నచిన్న ప్రమాదాల్లో మంటలను ఎలా అదుపు చెయ్యాలో నేర్పడం వల్ల ఫైర్‌కాల్స్ తక్కువయ్యాయి.
– వై నాగిరెడ్డి, ఫైర్ డీజీ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

