ఆర్అండ్బీ శాఖలో కొత్త పోస్టులు 472
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఆర్అండ్బీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులకు గత డిసెంబర్ 10న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆర్ అండ్ బీ శాఖ ఆయా జిల్లాల్లో ఖాళీలు తదితర సమగ్ర సమాచారం సేకరించింది. గురువారం కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది.
- ఉత్తర్వులు జారీ చేసిన ఆర్థికశాఖ
- అత్యధికంగా 132 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు
- డిప్యూటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు 90
- గతంలో మంజూరు చేసిన 62 పోస్టులు రద్దు
హైదరాబాద్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖలో కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది. ఆర్అండ్బీ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త పోస్టులకు గత డిసెంబర్ 10న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఆ తర్వాత ఆర్ అండ్ బీ శాఖ ఆయా జిల్లాల్లో ఖాళీలు తదితర సమగ్ర సమాచారం సేకరించింది. గురువారం కొత్తగా 472 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో అత్యధికంగా 132 సివిల్‌లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఉన్నాయి.
ఆ తర్వాత సివిల్లోనే 90 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గతంలో మంజూరు చేసిన 62 ఉద్యోగాలను రద్దు చేశారు. సీనియర్ స్టెనో (లోకల్ క్యాడర్), టైపిస్ట్ (హెచ్‌వో), టైపిస్ట్ (లోకల్ క్యాడర్), టెక్నీషియన్ (హెచ్‌వో), ప్రింటింగ్ టెక్నీషియన్ (లోకల్ క్యాడర్), వాచ్‌మన్(లోకల్ క్యాడర్), స్వీపర్ (లోకల్ క్యాడర్) పోస్టులను రద్దు చేస్తున్నట్టు ఆర్థిక శాఖ ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కొత్తగా అనుమతి ఇచ్చిన 472 పోస్టులతో కలిపితే.. ఇప్పటివరకు ఆర్థిక శాఖ 61,401 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే 43,099 పోస్టులకు ఆయా నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీచేశాయి.
రాష్ట్రంలో మొత్తం 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాత.. కొత్తగా మరో 7,029 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అంటే 2022లో మొత్తం 98,171 కొలువులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో 60,929 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ గతంలోనే అనుమతి ఇచ్చింది.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

