Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలోని 47 గ్రామ పంచాయతీలకు( Gram Panchayats ) ప్రభుత్వం రాష్ట్ర స్థాయి ఉత్తమ అవార్డులు ప్రకటించింది. మూడు పంచాయతీరాజ్( Panchayatraj ), గ్రామీణాభివృద్ధి( Rural Development ) సంస్థలనూ ఉత్తమ అవార్డులకు ఎంపిక చేసింది. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు రాజేంద్రనగర్( Rajendranagar ) వ్యవసాయ విశ్వవిద్యాలయం( Agriculture University ) ఆడిటోరియంలో అవార్డులను ప్రదానం చేస్తారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) హాజరు కానున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు( Minister Errabelli Dayaker Rao ) అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ఉత్తమ పంచాయతీల సర్పంచ్‌లు, గ్రామ కార్యదర్శులు, జిల్లా పంచాయతీ అధికారులను ఆహ్వానించారు. జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపికైన గ్రామాల సర్పంచ్‌లను సైతం ఆహ్వానించారు. రాష్ట్రంలో ఇప్పటికే గ్రామ, మండల, జిల్లా స్థాయిలో అవార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తయింది.
ఈ ఏడాది ఉత్తమ పంచాయతీల ఎంపిక విధానాన్ని కేంద్రం ప్రభుత్వం మార్చింది. తొమ్మిది క్యాటగిరీల్లో అవార్డులు ఇవ్వాలని, దీనిలో ప్రతి గ్రామం పాల్గొనే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. తొమ్మిది విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్న పంచాయతీలను కేంద్ర ప్రభుత్వం సూచించిన ప్రమాణాల ఆధారంగా ఎంపిక చేశారు. ప్రతి దశలోనూ ప్రత్యేక బృందాలు తనిఖీలు చేసి, సమగ్ర పరిశీలన జరిపి అవార్డులకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమమైన వాటిని జాతీయ అవార్డుల పోటీకి పంపింది. వచ్చే నెల 24న జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామాలకు జాతీయ అవార్డులు ఇవ్వనుంది. ఈ అవార్డుల జాబితాను ఏప్రిల్ రెండోవారం తర్వాత ప్రకటించే అవకాశమున్నది.
1. మర్లవాయి(జైనూరు మండలం, ఆసిఫాబాద్ జిల్లా)
2. మనుదొడ్డి( రాజోలి మండలం, గద్వాల జిల్లా)
3. సోలిపూర్(ఘన్పూర్ మండలం, వనపర్తి జిల్లా)
1. మరియపురం(గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా)
2. గౌతమ్‌పూర్(చుంచుపల్లి మండలం, కొత్తగూడెం జిల్లా)
3. ముజ్గి(నిర్మల్ రూరల్ మండలం, నిర్మల్ జిల్లా)
1.అల్లాపూర్(తాడూరు మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా)
2.హర్ధాస్పూర్(కొండాపూర్ మండలం, సంగారెడ్డి జిల్లా)
3.శ్రీనివాస్‌నగర్(మిర్యాలగూడ మండలం, నల్లగొండ జిల్లా)
1. కుకునూర్(వేల్పూర్ మండలం, నిజామాబాద్ జిల్లా)
2. మజీద్‌పూర్(అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, రంగారెడ్డి జిల్లా)
3. నెల్లుట్ల(లింగాలఘన్పూర్ మండలం, జనగామ జిల్లా)
3. చాపలతండా(డోర్నకల్ మండలం, మహబూబాబాద్ జిల్లా)
3. వెల్చాల (రామడుగు మండలం, కరీంనగర్ జిల్లా)
3. కామారెడ్డిగూడెం(దేవరుప్పల మండలం, జనగామ జిల్లా)
1. ముఖరా కే(ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
2. పర్లపల్లి (తిమ్మాపూర్(ఎల్ఎండీ) మండలం, కరీంనగర్ జిల్లా)
3. సుల్తాన్పూర్(ఎలిగేడ్ మండలం, పెద్దపల్లి జిల్లా)
1. గంభీరావుపేట(గంభీరావుపేట మండలం, సిరిసిల్ల జిల్లా)
2. ఎల్లంకి( రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా)
3. మూడుచింతలపల్లి(మూడుచింతలపల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి)
3. మల్లంపల్లి(ములుగు మండలం, ములుగు జిల్లా)
3. దొంగల ధర్మారం(రామాయంపేట మండలం, మెదక్ జిల్లా)
3. తిమ్మాపూర్(తిమ్మాపూర్(ఎల్ఎండీ) మండలం, కరీంనగర్ జిల్లా)
1. కొంగట్పల్లి(హన్వాడ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా)
2. రైతు నగర్(బిర్కూర్ మండలం, కామారెడ్డి జిల్లా)
3. గొల్లపల్లి(నెన్నల్ మండలం, మంచిర్యాల జిల్లా)
3. ముక్నూర్(పలిమెల మండలం, భూపాలపల్లి జిల్లా)
1. చీమలదరి(మోమిన్‌పేట్ మండలం, వికారాబాద్ జిల్లా)
2. పాలేరు( కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా)
3. చిప్పలతుర్తి( నర్సాపూర్ మండలం, మెదక్ జిల్లా)
3. ఖానాపూర్(మక్తల్ మండలం, నారాయణ్‌పేట్ జిల్లా)
1. ఇర్కోడ్( సిద్దిపేట రూరల్ మండలం, సిద్దిపేట జిల్లా)
2. ఐపూర్(ఆత్మకూర్ ఎస్ మండలం, సూర్యాపేట జిల్లా)
3. హిమ్మాత్రావుపేట(కొడిమ్యాల మండలం, జగిత్యాల జిల్లా)
3. పెంచికలపేట్(ఆత్మకూర్ మండలం, హనుమకొండ జిల్లా)
3. మోహినికుంట(ముస్తాబాద్ మండలం, సిరిసిల్ల జిల్లా)
1. కన్హా(నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా)
2. ముఖరా కే(ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
3. ఇబ్రహీంపూర్(నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా)
3. నవాబ్‌పేట్(చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా)
3. మరియపురం(గీసుకొండ మండలం, వరంగల్ జిల్లా)
1. కన్హా(నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా)
2. ఎర్రవెల్లి(మర్కూక్ మండలం, సిద్దిపేట జిల్లా)
3. ముఖరా కే(ఇచ్చోడ మండలం, ఆదిలాబాద్ జిల్లా)
3. పంతంగి(చౌటుప్పల్ మండలం, భువనగిరి జిల్లా)
3. బంజరుపల్లి(నారాయణరావుపేట మండలం, సిద్దిపేట జిల్లా)
1. తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ (టీఎస్ఐఆర్డీ), రాజేంద్రనగర్, హైదరాబాద్
2. ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ), రాజేంద్రనగర్
3.ఎక్స్టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ (ఈటీసీ), హసన్‌పర్తి