అగ్రికల్చర్ బీఎస్సీలో 465 సీట్లు భర్తీ
2026-27 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి రెండో రోజు కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు 465 సీట్లు భర్తీ అయినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు.
- నేడు ముగియనున్న మొదటి విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : 2026-27 విద్యాసంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం పరిధిలోని కళాశాలల్లోని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లోని రెగ్యులర్ సీట్ల భర్తీకి రెండో రోజు కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు 465 సీట్లు భర్తీ అయినట్టు వర్సిటీ వీసీ డాక్టర్ అల్దాస్ జానయ్య తెలిపారు. మొదటి రోజు 213 సీట్లు, రెండో రోజు శుక్రవారం జరిగిన కౌన్సెలింగ్‌లో 242 సీట్లు పూర్తయినట్టు చెప్పారు. శనివారం సాయంత్రం 5 గంటలకు మొదటి విడత కన్వీనర్ కోటా సీట్లు భర్తీ అవుతాయని, అనంతరం ప్రత్యేక కోట సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వీసీ అల్దాస్ జానయ్య వెల్లడించారు.
నేటి నుంచి ఎడ్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల బీఈడీ కోర్సుల సీట్ల భర్తీకి ఎడ్‌సెట్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. ఈ కౌన్సెలింగ్ శనివారం నుంచి ప్రారంభమవుతుందని ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. శనివారం నుంచి సెప్టెంబర్ 3 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్, 6 నుంచి 8 వరకు వెబ్ ఆప్షన్లు, 9న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్‌కు అవకాశం కల్పించామని పేర్కొన్నారు. 12న సీట్లు కేటాయిస్తామని, సీట్లు పొందిన వారు 15 నుంచి 19 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

