ఆ ఎమ్మెల్యేకు 444 కోట్లు ఎక్కడివి?
ఎమ్మెల్యేగా గెలిచిన 480 రోజుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.444 కోట్ల అప్పు చెల్లించడం రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
- ఏడాదిన్నరలోనే అన్ని అప్పులు ఎలా కట్టారు?
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై విచారణ
మంచిర్యాల, అక్టోబర్ 28(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అధికార పార్టీ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యేగా గెలిచిన 480 రోజుల్లో బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.444 కోట్ల అప్పు చెల్లించడం రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ముఖ్యనేత సీరియస్‌గా తీసుకున్నట్టు తెలిసింది. మంత్రి పదవి రేసులో ఉన్న సదరు ఎమ్మెల్యేకు సంబంధించిన ఈ వ్యవహారంపై కూపీలాగి చెక్ పెట్టే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.
బ్యాంకుల నుంచి ఆయన తీసుకున్నది ఎంత? ఏ సంవత్సరంలో తీసుకున్నారు? ఎమ్మెల్యేగా గెలిచాక 16 నెలల్లో అంత పెద్ద మొత్తంలో ఎలా చెల్లించారు? ఆయన చూపించిన కంపెనీల లావాదేవీలు ఏంటి? ఏ కంపెనీ నుంచి ఎంత వచ్చాయి? వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆదాయ మార్గాలేంటి? భూ దందాలు, సెటిల్మెంట్లు చేశారా? అన్న కోణంలో సర్కార్ నిఘా సంస్థలు (ఇంటెలిజెన్స్, ఎస్బీ) రహస్య విచారణ చేస్తున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే బాధితులను కలిసి వివరాలు సేకరించడంతోపాటు స్టేట్మెంట్ రికార్డు చేస్తున్నట్టు తెలిసింది. ఆ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఆయనతో విభేదించిన నాయకులు, కాంట్రాక్టర్లు, వ్యాపారులను కలిసిన నిఘా బృందాలు పూర్తిస్థాయిలో విచారించి, నివేదిక సిద్ధంచేసే పనిలో నిమగ్మమైనట్టు సమాచారం.
ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన ముఖ్యనేత
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి అధికార పార్టీలో కీలకనేతగా ఉన్న సదరు ఎమ్మెల్యేను ముందు నుంచీ ముఖ్యనేత టార్గెట్ చేశారన్న చర్చ పార్టీలో నడుస్తున్నది. పార్టీ అధ్యక్ష పదవి చేపట్టినప్పుడు ఆ ఎమ్మెల్యే తీవ్రంగా వ్యతిరేకించడాన్ని మనసులో పెట్టుకున్నట్టు తెలిసింది. దీనికితోడు సదరు ఎమ్మెల్యే వ్యతిరేకవర్గంతో అంటకాగుతుండటంపై సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది. మంత్రి పదవి రేసులో ఉన్న ఆ ఎమ్మెల్యేను కాదని, ఎన్నికల ముందు పార్టీలో చేరిన నాయకుడికి మంత్రి పదవి దక్కేలా చేశారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. తాజాగా అదే మంత్రి, అధికార పార్టీకి చెందిన ఎంపీతో కలిసి ఉమ్మడి జిల్లాలో సదరు ఎమ్మెల్యేకు చెక్ పెట్టేలా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
అందులో భాగంగానే రూ.444 కోట్ల బ్యాంకు రుణాల చెల్లింపులపై రహస్య విచారణ చేయించడంతోపాటు నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ప్రత్యామ్నాయంగా మరోనేతను ప్రోత్సహిస్తున్నారు. మంత్రి, ఎంపీ అండదండలతో ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సదరు నేత దూకుడు పెంచారు. పార్టీలోనే ఉంటూ కార్పొరేటర్లు, సర్పంచ్‌లతో మరోవర్గాన్ని తయారు చేసుకున్నారు. నిత్యం మంత్రి, ఎంపీలను కలుస్తూ కలిసి వచ్చేవారిని తన వర్గంలో చేర్చుకుంటూ ముందుకు వెళ్తున్నారు. సదరు ఎమ్మెల్యేకు చెక్ పెట్టడంతోపాటు, రాజకీయంగా ఒంటరి చేయాలన్న ఉద్దేశంతో ముఖ్యనేత, మంత్రి పావులు కదుపుతున్నారని తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

