హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 11: హుజూరాబాద్‌లో నామినేషన్ల పరిశీలన పూర్తయింది. ఈ నెల 8న ముగిసిన నామినేషన్ల స్వీకరణలో 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం నామినేషన్ల పరిశీలన అనంతరం ఆయన మాట్లాడుతూ.. 61 మందిలో 19 మంది అభ్యర్థులు వేసిన 23 సెట్ల నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో తిరసరించామని తెలిపారు. మిగతా 42 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్టు చెప్పారు. బుధవారం వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నదని పేర్కొన్నారు.