Telangana | మున్సిపల్‌శాఖలో 400 రహస్య జీవోలు!.. అసలేం జరుగుతున్నది?..
Telangana | మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. అంటే.. రెండు శాతం జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట.
Telangana | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మున్సిపల్ శాఖలో ఏం జరుగుతున్నది? అంటే అంతా రహస్య జీవోల తతంగం నడుస్తున్నది అని అర్థమవుతున్నది. ఎందుకలా అంటే.. ఆ శాఖలో ఇప్పటి వరకు మొత్తం 390 జీవోలు విడుదల కాగా, అందులో కేవలం 8 మాత్రమే అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. అంటే.. రెండు శాతం జీవోలు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నమాట. మిగిలిన 98 శాతం జీవోలు రహస్యంగా ఉంచారు. దీనిపై సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. ఏ సంస్థలకు ఎలాంటి మినహాయింపులు, రాయితీలు, సబ్సిడీలు, విధానపరమైన నిర్ణయాల్లో ఎవరెవరికి లబ్ధి చేకూర్చారోనని, ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ప్రజలకు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా రహస్యాన్ని పాటిస్తున్నారని విమర్శిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉండగా.. జీవోలన్నీ వెబ్సైట్లో పెట్టాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ముఖ్యనేతలే ఇప్పుడు జీవోలను రహస్యంగా ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నిస్తున్నారు. అత్యంత కీలకమైన మున్సిపల్‌శాఖలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, ఓఆర్ఆర్, మూసీ నది, మెట్రో రైలు, హైదరాబాద్ గ్రోత్ కారిడార్, డీటీసీపీ, సీడీఎంఏ భాగం.
అలాంటి శాఖలో జీవోలను రహస్యంగా ఉంచటం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సామాజిక కార్యకర్తలు పేర్కొంటున్నారు. ప్రభుత్వ నిర్ణయాలు తెలుసుకొనే హక్కు ప్రజలకు ఉన్నదని స్పష్టం చేస్తున్నారు. ‘పంచాయతీరాజ్ శాఖలోనూ గత జనవరి నుంచి మొత్తం 480 జీవోలు జారీఅయ్యాయి. ఈ శాఖ వెబ్సైట్లో 26 జీవోలను మాత్రమే పొందుపరిచారు. మిగిలినవన్నీ రహస్యంగానే ఉన్నాయి. ఈ రెండు శాఖల్లోనే కాకుండా దాదాపు ప్రతి శాఖలో ఇదే పరిస్థితి ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా జీవోలన్నింటనీ బహిర్గతం చేయాలి. అందరికీ అందుబాటులో ఉండేలా వెబ్సైట్లో ఉంచాలి’ అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న కీలకమైన జీవోలన్నీ రహస్యంగా ఉంచుతున్నారని.. అందుకు మాజీ ఐపీఎస్ అంజనేయరెడ్డి నియామకమే ఉదాహరణ అని పేర్కొంటున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

