డిసెంబర్లో హైదరాబాద్ బుక్‌ఫెయిర్
వచ్చే నెల 18 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో 39వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను నిర్వహించనున్నారు.
- 18 నుంచి 28 వరకు పుస్తక ప్రదర్శన
రవీంద్రభారతి,నవంబర్ 1 : వచ్చే నెల 18 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో 39వ హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం పుస్తక ప్రదర్శన లోగోను హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్లో బుక్ ఫెయిర్ సలహా కమిటీ సభ్యులు సీనియర్ ఎడిటర్ రామచంద్రమూర్తి, విశ్రాంత ప్రొఫెసర్ రామా మెల్కోటే, కవి యాకూబ్, వైస్ ప్రెసిడెంట్ బాల్‌రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ బుక్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ నెల 14లోగా దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని తెలిపారు. బుక్‌ఫెయిర్ ప్రాంగంణం వేదికలకు సాహితీవేత్తల పేర్లను ఖరారు చేసినట్టు పేర్కొన్నారు.
బుక్‌ఫెయిర్ ప్రాంగణానికి ప్రముఖ ఉర్దూ రచయిత్రి జిలానీ బానో పేరు పెట్టినట్టు తెలిపారు. సాహిత్య వేదికకు రచయిత, అనువాదకుడు ముక్తవరం పార్థసారథి, పుస్తకావిష్కరణల వేదికకు దళిత హక్కుల కార్యకర్త రచయిత వైబీ సత్యనారాయణ పేర్లను ఖరారు చేసినట్లు వివరించారు. ఇతర వేదికలకు సదానంద శారద, ఏటుకూరి ప్రసాద్, రైటర్స్ స్టాల్స్‌కు తేలిదేవర భానుమూర్తి పేర్లను నిర్ణయించినట్టు చెప్పారు. ఈ బుక్ఫెయిర్లో సుమారు 320 పుస్తక స్టాళ్లను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ డిజైన్‌ను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలోకార్యదర్శి రజని, సంజయ్,శోభన్‌బాబు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

