RTC bus | ఆర్టీసీ బస్సులో రూ.36 లక్షలు చోరీ.. జడ్చర్లలో ఘటన
RTC bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) రూ.36 లక్షలు చోరీకి(Money stolen) గురైన ఘటన మహబూ బ్‌నగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నది.
జడ్చర్ల, జూలై 16 : ఆర్టీసీ బస్సులో(RTC bus) రూ.36 లక్షలు చోరీకి(Money stolen) గురైన ఘటన మహబూ బ్‌నగర్ జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్నది. జడ్చర్ల(Jadcharla) సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దామోదర్ అనే వ్యక్తి హైదరాబాద్ ట్రాన్స్‌కో డిపార్ట్మెంట్లో విధులు నిర్వర్తి స్తున్నాడు. అయితే, కర్నూల్లో ఉంటున్న చెల్లెలి అవసరం నిమిత్తం తన పీఎఫ్, జీపీఎఫ్ డబ్బుల నుంచి రూ.36 లక్షలు తీసుకొ ని హైదరాబాద్‌లోని జేబీఎస్ బస్టాండ్‌లో పికెట్ డిపోకు చెందిన (టీఎస్09జెడ్7840) బస్సులో ఎక్కాడు. ఈ బస్సు హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్నది. డబ్బులు ఉన్న బ్యాగును సీటుపై ఉన్న క్యాబిన్లో పెట్టాడు.
జడ్చర్ల బస్టాండ్‌లో టీ కోసం పది నిమిషాలు బస్సును నిలుపగా.. దామోదర్ టిఫిన్ చేయడానికి బ్యాగు తీసు కొని కిందకు దిగాడు. బ్యాగు బరువులో తేడా అనిపించడంతో తెరిచి చూడగా.. అందులో నాలుగు అరలీటర్ వాటర్ బాటిళ్లు దర్శనమిచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు డబ్బులు అపహరించినట్లు గుర్తించిన దామోదర్ జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బస్సును పోలీస్‌స్టేషన్‌కు తరలించి సీఐ ఆదిరెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. బస్సులోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. అయితే, బస్సులో ఒక వ్యక్తి అటూఇటూ అనుమానాస్పదంగా తిరిగినట్లు బాధితుడు తెలిపాడు. దామోదర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు జరుపుతున్నట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

