టీఎస్‌పీఏకి 3 అంతర్జాతీయ సర్టిఫికెట్లు
పోలీసు శిక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి మూడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లు వరించాయి.
- ప్రదానం చేసిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సంస్థ
- క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఫుడ్సేఫ్టీల్లో టాప్
హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): పోలీసు శిక్షణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్న రాజా బహదూర్ వెంకట రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ (టీఎస్పీఏ)కి మూడు అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్లు వరించాయి. అకాడమీలో క్వాలిటీ ఎడ్యుకేషన్, ఎన్విరాన్మెంట్, ఫుడ్ సేఫ్టీ విభాగాల్లో అత్యుత్తమ ప్రమాణాలపై హైదరాబాద్‌కు చెందిన హెచ్‌వైఎం ఇంటర్నేషనల్ సంస్థ గురువారం అకాడమీ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్‌కు ఐఎస్వో సర్టిఫికెట్లను ప్రదానం చేసింది.
కొన్ని రోజులుగా అకాడమీలో నిర్వహిస్తున్న శిక్షణ, అక్కడి పర్యావరణం, వాతావరణం, ఆహార భద్రత ప్రమాణాలపై హెచ్‌వైఎం సంస్థ తనిఖీలు నిర్వహించింది. ఈ మూడు విభాగాల్లో పోలీసు అకాడమీ నాణ్యమైన ప్రమాణాలు పాటిస్తుండటంతో ఐఎస్వో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఒక పోలీస్ శిక్షణా సంస్థ ఈ తరహా అవార్డులను కైవసం చేసుకోవటం ఎంతో స్ఫూర్తిదాయకమని అకాడమీ డైరెక్టర్ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. దేశంలో ఉన్న పోలీస్ శిక్షణా సంస్థల్లో తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ అత్యుత్తమ శిక్షణా సంస్థగా గతంలో కేంద్ర హోంశాఖ నుంచి మూడుసార్లు అవార్డులు పొందినట్టు గుర్తుచేశారు. కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ శివయ్య ఆలపాటి, జాయింట్ డైరెక్టర్ నవీన్‌కుమార్ ఐపీఎస్, డిప్యూటీ డైరెక్టర్లు డాక్టర్ జానకి షర్మిళ, అనసూయ, శరత్చంద్ర పవార్, నర్మద, రాఘవరావు, పీ శ్రీరామమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

