హైదరాబాద్: నగర శివార్లలోని కొంపల్లిలో (Kompally) అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లిలోని బిగ్ బజార్ వద్ద ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ను (Divider) ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. మద్యం మత్తులోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కారులో మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉన్నది.