హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) విద్యార్థిని ఎస్ఎం అఫ్నాన్ ఎంఏ ఇంగ్లిష్‌లో మొదటి ర్యాంకు సాధించారు. దీంతో ఆమెను మూడు బంగారు పతకాలు వరించాయి. వీటిలో సరోజిని నాయుడు మెమోరియల్ ట్రస్ట్ మెడల్, సిటీ ఇంద్ర ఎండోమెంట్ మెడల్, ఓబీసీ మెడల్‌ను ఆమె అందుకొన్నారు. ఈ నెల 13న నిర్వహించిన యూవోహెచ్ 23వ స్నాతకోత్సవంలో అఫ్నాన్‌కు గోల్డ్ మెడల్స్ ప్రకటించారు. అయితే, ఆ పతకాలను అఫ్నాన్ సోమవారం అందుకొన్నట్టు వర్సిటీ అధికారులు తెలిపారు.