29 కార్మిక చట్టాల రద్దు దుర్మార్గం.. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లు తేవడం అన్యాయం
దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటికి బదులు 4 లేబర్ కోడ్లను అమలుచేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తప్పుబట్టారు.
- కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ త్వరలోనే తీవ్ర ఆందోళనలు
- బీఆర్టీయూ రాష్ట్ర నాయకుడు రాంబాబు యాదవ్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి, వాటికి బదులు 4 లేబర్ కోడ్లను అమలుచేస్తామని కేంద్ర కార్మికశాఖ మంత్రి ప్రకటించడాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ)రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తప్పుబట్టారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పార్లమెంట్లో చట్టం చేసిన 29 కార్మిక చట్టాలను రద్దు చేసిందని పేర్కొన్నారు. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చిన ఈ నెల 21ని చీకటిరోజుగా పరిగణిస్తున్నట్టు పేర్కొన్నారు.
ఈ మేరకు శనివారం హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో కార్మిక వర్గానికి ఉద్యోగ భద్రత కొరవడుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా ఓటీ, 8 గంటల పని విధానాలు రద్దవుతాయని విమర్శించారు. కార్మిక సంఘాల ప్రాధాన్యత తగ్గడంతోపాటు వారి సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తంచేశారు, కేంద్ర సర్కార్ మొండివైఖరిని నిరసిస్తూ బీఆర్టీయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం నాయకులు మారయ్య, నారాయణ, లక్ష్మణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

