IAS Officers Transfer | తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లు బదిలీ..
IAS Officers Transfer | తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది.
IAS Officers Transfer | తెలంగాణలో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా మహేశ్ దత్ ఎక్కాను నియమించింది. ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా అహ్మద్ నదీమ్, సాగునీటి శాఖ క్యాదర్శిగా రాహుల్ బొజ్జా బదిలీ చేసింది. మొన్నటి వరకు సీఎంఓ ముఖ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను ఫైనాన్స్ కమిషన్ సభ్య కార్యదర్శిగా నియమించింది.
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ బాధ్యతలను డీ దివ్యకు అప్పగించింది. నల్గొండ కలెక్టర్‌గా హరిచందన దాసరిని బదిలీ చేసింది. వెయిటింగ్లో ఉన్న భారతీ హొళికెరికి ఆర్కియాలజీ బాధ్యతలను అప్పగించింది. రంగారెడ్డి కలెక్టర్‌గా కే శశాంక, మహబూబాబాద్ కలెక్టర్‌గా అద్వైత్ కుమార్‌ను బదిలీ చేసింది. టీఎస్ డైరీ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఫెడరేషన్ ఎండీగా చిట్టెం లక్ష్మి, కార్మికశాఖ డైరెక్టర్‌గా క్రిష్ణ ఆదిత్య, మైనారిటీ గురుకులాల సొసైటీ కార్యదర్శిగా ఆయేషా మస్రత్ ఖానమ్‌ను నియమించింది.
సీఎంవో కార్యాలయ జాయింట్ సెక్రెటరీగా సంగీత సత్యనారాయణ, సంగారెడ్డి కలెక్టర్‌గా వల్లూరి క్రాంతి, జోగులాంబ కలెక్టర్‌గా బీఎం సంతోష్, హైదరాబాద్ స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా కధీరవన్, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా బీ వెంకటేశం, పీసీబీ సభ్య కార్యదర్శిగా జ్యోతి బుద్ధా ప్రకాశ్, ఆయూష్ డైరెక్టర్‌గా ఎం ప్రశాంతి, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ముఖ్య కార్యదర్శిగా డీ కృష్ణ భాస్కర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీగా ఆర్వీ కర్ణన్, జీఏడీ కార్యదర్శిగా రఘునందన్‌రావు, పంచాయతీ కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియాను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

