జగిత్యాల కలెక్టరేట్, మే 15 : కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డ కేసులో తండ్రికి జగిత్యాల కోర్టు 25 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఎస్సై రాజు నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల ఠాణా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన ఎల్లాల తుకారాం 2022 అక్టోబర్ 14న రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న రెండో భార్య మైనర్ కూతురిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అదే ఏడాది అక్టోబర్ 18 కోరుట్ల ఠాణాలో కేసు నమోదైంది. బుధవారం కోర్టులో విచారణ జరుగగా తుకారాం లైంగిక దాడికి పాల్పడినట్టు నిర్ధారణ కావడంతో 25 ఏండ్ల జైలు శిక్షతోపాటు రూ. 10వేల జరిమానా, బాధిత బాలికకు రూ. 3 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశిస్తూ జిల్లా జడ్జి నీలిమ తీర్పునిచ్చారు.