పంచాయతీరాజ్‌కు రూ.230 కోట్ల నష్టం

- భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీలు
- మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గత రెండు నెలలుగా కురిసిన భారీ వర్షాలతో పంచాయతీరాజ్ విభాగానికి తీవ్ర నష్టం వాటిల్లింది. జూలై, ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాల వల్ల పలు పంచాయతీరాజ్ రోడ్లు, డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. వీటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. మొత్తం 1,058 పనులకు రూ.230 కోట్ల నష్టం జరిగినట్లు అధికారులు గుర్తించారు. జూలైలో రూ.98 కోట్లు, ఆగస్టులో రూ.132 కోట్ల నష్టం వాటిల్లినట్లు తేల్చారు. 372 రోడ్లకు రూ.96 కోట్ల నష్టం వాటిల్లినట్టు లెక్కగట్టారు. 257 చోట్ల గండ్లు పడిన రోడ్ల మరమ్మతులకు రూ.18 కోట్లు, 429 క్రాస్ డ్రైనేజీ పనులకు రూ.116 కోట్లు, పంచాయతీరాజ్ ఆధ్వర్యంలోని 18 భవనాల మరమ్మతులకు రూ.2.41 కోట్లు అవసరమవుతాయని ప్రతిపాదనల్లో పేర్కొన్నారు. వీటిని త్వరలో ప్రభుత్వానికి అందజేయనున్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

