టెట్‌కు 2,26,956 దరఖాస్తులు
టీచర్స్ ఎలిజిబిలిటీ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నవంబర్ 29తో గడువు ముగియగా మొత్తం 2,26,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పేపర్-1కు 27,389 మంది ఇన్ సర్వీస్ టీచర్లు, 58,149 మంది ఇతర అభ్యర్థులతో కలిపి మొత్తం 85,538 దరఖాస్తులు వచ్చాయి.
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ) : టీచర్స్ ఎలిజిబిలిటీ పరీక్షకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. నవంబర్ 29తో గడువు ముగియగా మొత్తం 2,26,956 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పేపర్-1కు 27,389 మంది ఇన్ సర్వీస్ టీచర్లు, 58,149 మంది ఇతర అభ్యర్థులతో కలిపి మొత్తం 85,538 దరఖాస్తులు వచ్చాయి.
పేపర్-2కు 44,281 మంది ఇన్‌సర్వీస్ టీచర్లు, 1,07,935 మంది ఇతర అభ్యర్థులతో కలిపి మొత్తం 1,52,216 మంది దరఖాస్తులు సమర్పించారు. రెండు పేపర్లకు కలిపి మొత్తంగా 2,26,956 దరఖాస్తులు వచ్చాయి. వివరాలకు 7093708883, 7093708884 నంబర్లను సంప్రదించాలని అధికారులు కోరారు. పరీక్షలు జనవరి 3 నుంచి 31 వరకు జరగనున్నాయి.
టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక
హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): టీఆర్టీఎఫ్ రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వేములవాడలో ఆదివారం నిర్వహించిన యూనియన్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఎన్నికల అధికారులు మానేటి ప్రతాప్‌రెడ్డి, లక్కిరెడ్డి సంజీవరెడ్డి వెల్లడించారు. అధ్యక్షుడిగా కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శిగా మారెడ్డి అంజిరెడ్డితోపాటు కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని రమేశ్, అంజిరెడ్డి ప్రకటించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire accident | కూకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. షార్ట్ సర్క్యూటే కారణమా?
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

