పంచాయతీలకు 217 కోట్లు

పెండింగ్ పనులను పూర్తి చేయాలి
సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
హైదరాబాద్, మే 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ.217 కోట్లను అన్ని గ్రామ పంచాయతీలకు విడుదలచేసిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. ఈ నిధులతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో కొవిడ్ బాధితులకు హోంఐసొలేషన్ వసతి లేకపోతే స్థానిక ప్రభుత్వ పాఠశాలలను, హాస్టళ్లను ఐసొలేషన్ కేంద్రాలుగా మార్చాలని సూచించారు. సోమవారం బంజారాహిల్స్‌లోని క్యాంపు కార్యాలయంలో తన శాఖలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, కరోనా నివారణ చర్యలపై ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. దాతల సహకారంతో ఐసొలేషన్ కేంద్రాల్లోని రోగులకు ఆహారం, పండ్లు, పాలు, ఇతర నిత్యావసర వస్తువులు అందించాలని మంత్రి కోరారు. ఆరోగ్య సర్వేలో ఆశవర్కర్లతో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి సర్వే విజయవంతంగా జరిగే విధంగా చూడాలని సూచించారు. కరోనా కష్టకాలంలోనూ ఆసరా పింఛన్లకు నిధులు విడుదలచేసినందుకు సీఎం కేసీఆర్‌కు మంత్రి ఎర్రబెల్లి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.1,554 కోట్లతో 12,270 వైకుంఠధామాల నిర్మాణం చేపట్టగా.. 11,250 పూర్తయ్యాయని, 1,470 వివిధ దశల్లో ఉన్నాయని తెలిపారు. కరోనా దృష్ట్యా పూర్తయిన వైకుంఠధామాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. హరితహారం మొక్కలు ఎండిపోకుండా 100 శాతం సంరక్షించడానికి సర్పంచులు, కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్‌రావు, పీఆర్ ఈఎన్సీ సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

