Sunkesula Reservoir | సుంకేసులకు భారీగా వరద.. 20 గేట్ల ద్వారా దిగువకు 75 వేల క్యూసెక్కులు
జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు.
రాజోలి: జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి శివారులోని తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల జలాశయానికి (Sunkesula Reservoir) వరద పోటెత్తింది. ఎగువ నుంచి 82,300 క్యూసెక్కుల వరద వస్తుండటంతో అధికారులు 20 గేట్లు ఎత్తివేశారు. దీంతో 75,220 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి తరలివెళ్తున్నది. సుంకేసుల పూర్తిస్థాయి నీటినిల్వ 1.235 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.507 టీఎంసీల నీరు ఉన్నది.
కాగా, జూరాల ప్రాజెక్టుకు వదర కొనసాగుతున్నది. దీంతో అధికారులు 37 గేట్లు ఎత్తి 2.55 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన ఉన్న పరీవాహక ప్రాంతాల నుంచి 2.70 లక్షల క్యూసెక్కుల వదర ప్రాజెక్టుకు వస్తున్నది. జూరాల పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు. ఇప్పుడు 317.010 మీటర్లుగా ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 6.749 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.042 టీఎంసీలు ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

