జూరాలకు 2.58 లక్షల క్యూసెక్కుల వరద
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోగా, గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు.
- శ్రీశైలంలో 109 టీఎంసీలకు చేరిన నిల్వ
- పోతిరెడ్డిపాడు నుంచి 12 టీఎంసీలకు ఏపీ డిమాండ్
హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ)/న్యూస్ నెట్వర్క్: కర్ణాటక, మహారాష్ట్రతోపాటు, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణలో వరద పోటెత్తుతున్నది. ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర ప్రాజెక్టులకు భారీగా వరద వచ్చి చేరుతున్నది. ఆయా ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యానికి చేరుకోగా, గేట్లను ఎత్తి వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. శుక్రవారం సాయంత్రానికి జూరాల ప్రాజెక్టుకు 2.58 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలానికి 2.59 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చే రుతున్నది. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నది. ఎస్సారెస్పీకి, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. శుక్రవారం రాత్రి 9 గంటల వరకు లక్ష్మీబరాజ్ వద్ద 7.71 లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.
మళ్లీ 48 అడుగులకు గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి వరద శుక్రవారం మళ్లీ పెరిగింది. రాత్రి 9.15 గంటలకు 48 అడుగులు దాటడంతో మరోసారి రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికకు దగ్గరగా ప్రవహిస్తున్నది. 12.53 మీటర్ల ఎత్తు దాటి పారుతూ లక్ష్మీ బరాజ్ వైపు పరుగులు తీస్తున్నాయి. పుష్కరఘాట్ మునిగిపోయింది.
ఏపీకి మరో 3 టీఎంసీలు
ఇటీవలే కేఆర్ఎంబీ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ సమావేశమై నాగార్జునసాగర్ నుంచి 5.5 టీఎంసీలు తెలంగాణకు, 4.5 టీఎంసీల ను ఏపీ సర్కారుకు కేటాయించింది. ఒంగోల్తోపాటు, పలు మున్సిపాలిటీల్లో తాగునీటి కొరత ఉన్నదని, మరో 3 టీఎంసీలను నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా విడుదల చేయాలని కోరుతూ కేఆర్ఎంబీకి ఏపీ లేఖరాసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

