కోర్టుల్లో 1904 పోస్టులు.. ఆరు నోటిఫికేషన్లు జారీ చేసిన హైకోర్టు
రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో
- అత్యధికంగా 1,226 ఆఫీస్ సబార్డినేట్స్
- ఈ నెల 11 నుంచి 31 వరకు దరఖాస్తులు
- వచ్చే నెల 15 నుంచి హాల్‌టికెట్ల డౌన్లోడ్
- మార్చిలో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు
హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి హైకోర్టు ఒకేసారి ఆరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ఎగ్జామినర్, ఫీల్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ఆఫీస్ సబార్డినేట్ విభాగాల్లో మొత్తం 1,904 పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ ద్వారా ఈ నెల11వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 31వ తేదీతో దరఖాస్తుల స్వీకరణ ముగుస్తుంది.
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి హాల్‌టికెట్లను వైబ్‌సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్చిలో ఆయా పోస్టులకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తామని హైకోర్టు రిజిస్ట్ట్రార్ తెలిపారు. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు ఇతర పూర్తి వివరాలకు హైకోర్టు అధికారిక వెబ్సైట్ http;//tshc.gov.inను సందర్శించవచ్చు. అనుమానాలను నివృత్తి చేసుకొనేందుకు helpdesk-tshc@telangana.gov.in ఈ-మెయిల్లో సంప్రదించొచ్చు. 040- 23688394 నంబర్‌కు హైకోర్టు పని దినాల్లో ఫోన్ చేసి కూడా తమ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు అని నోటిఫికేషన్లలో పేరొన్నారు.

Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

