మాయమైన బొగ్గు ప్రత్యక్షం?.. సోషల్ మీడియాలో వైరల్
సింగరేణి సంస్థలో రూ.1,600 కోట్ల కోల్స్కామ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు బట్టబయలు చేయగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
- హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో ఓసీ2 గనిపై కనిపిస్తున్న నిల్వలు
- పనికిరాని బొగ్గుతో కవర్ చేస్తున్న సింగరేణి అధికారులు
జయశంకర్ భూపాలపల్లి, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థలో రూ.1,600 కోట్ల కోల్స్కామ్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్‌రావు బట్టబయలు చేయగా రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. బొగ్గు కుంభకోణంతోపాటు సింగరేణిలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై హరీశ్‌రావు సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తూ కోల్‌బెల్ట్ బాటపట్టారు. ఆయన పర్యటనతో సింగరేణి అధికారుల్లో వణుకు మొదలైంది. ఏరియా వారీగా మాయమైన బొగ్గును టెల్ (పనికిరాని) బొగ్గుతో కవర్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది.
ఏప్రిల్‌లో రూ.1,600 కోట్ల విలువ చేసే 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్‌ను బీఆర్ఎస్ బయట పెట్టినా ఇంతవరకు ప్రభుత్వం, కేంద్రం నోరుమెదపడం లేదు. కాగా హరీశ్‌రావు శుక్రవారం భూపాలపల్లి ఏరియాలో పర్యటించనున్న నేపథ్యంలో సింగరేణి అధికారులు హడావిడిగా ఇతర గనుల నుంచి బొగ్గును ఓసీ 2 గనిపై నిల్వచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. భూపాలపల్లి ఏరియాలో 5.40 లక్షల టన్నులు మాయమైనట్టు తెలుస్తుండగా ఆ బొగ్గును సమీకరిస్తూ స్టాక్‌ను చూపించే ప్రయత్నం చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
హరీశ్‌రావు పర్యటనతో వణుకు
‘కాంగ్రెస్ హఠావో.. సింగరేణి బచావో’ పేరుతో హరీశ్‌రావు కోల్‌బెల్ట్ యాత్ర చేపట్టి టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సింగరేణి పరిరక్షణ సదస్సులు నిర్వహిస్తున్నారు. గత ఆదివారం గోదావరిఖనిలో ప్రారంభమైన సదస్సులు సింగరేణి వ్యాప్తంగా కొనసాగనున్నాయి. శుక్రవారం భూపాలపల్లిలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో సదస్సు జరుగనున్నది. ఈ సదస్సుకు హరీశ్‌రావు రానుండగా ఏరియా సింగరేణి అధికారులు అప్రమత్తమై ఓసీ2పై కోల్స్టాక్ చూపించే ప్రయత్నాలను అధికారులు సీక్రెట్‌గా చేస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

