144 Section | కుమ్రం భీం జిల్లాలో ఏనుగు సంచారం.. 144 సెక్షన్
కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
ఆసిఫాబాద్: కుమ్రం భీం జిల్లాలో ఎనుగు దాడితో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగు సంచరిస్తున్న ప్రాంతాల్లో 144 సెక్షన్ (144 Section) విధించారు. గ్రామ శివారు ప్రాంతాల్లో వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు వస్తే గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఏనుగు కనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆసిఫాబాద్ జిల్లాలో రెండు రోజులుగా గజరాజు బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం మధ్యాహ్నం చింతలమానేపల్లి మండలం బూరెపల్లి గ్రామ పరిధిలో రైతు అల్లూరి శంకర్ (55), తన భార్య సుగుణతో తమ తోటలో మిరపకాయలు ఏరుతున్నారు. అదే సమయంలో బూరెపల్లి-రణవెల్లి గ్రామాల మధ్య చేలల్లో ఏనుగు తిరగడాన్ని స్థానిక రైతులు గమనించారు. జనవాసాల్లోకి వచ్చి ఎక్కడ దాడి చేస్తుందోనని భావించి కేకలు వేయగా, అది చేలల్లో గుండా పరిగెత్తుకుంటూ వచ్చి శంకర్‌పై దాడి చేసింది. తీవ్రగాయాలతో అతడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
ఇక గురువారం ఉదయం పెంచికల్‌పేట మండలం కొండపల్లికి తారు పోషన్న (50) అనే రైతు మిర్చితోటలో పనిచేసుకుంటుండగా దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. స్థానికులు ఏనుగును అక్కడినుంచి తరిమేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

