కంటి వెలుగు ఆల్‌టైమ్ రికార్డ్
కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించామని, కేవలం 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి నేత్రపరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించలేదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు.
- 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి పరీక్షలు
- రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి
- రాష్ట్రవ్యాప్తంగా 12 పాకో యంత్రాలు ప్రారంభం
- రూ.3.5 కోట్లు వెచ్చించిన ప్రభుత్వం
- ఇకపై ఉచితంగా రూ.40 వేల ఖరీదైన కాటరాక్ట్ సర్జరీలు
హైదరాబాద్ సిటీబ్యూరో/మెహిదీపట్నం, జూన్ 28 (నమస్తే తెలంగాణ): కంటి వెలుగు రెండో విడత కార్యక్రమంలో ఆల్‌టైమ్ రికార్డ్ సృష్టించామని, కేవలం 100 పనిదినాల్లోనే 1.62 కోట్ల మందికి నేత్రపరీక్షలు నిర్వహించామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడా ఇంత భారీ సంఖ్యలో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించలేదని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌దేనని పేర్కొన్నారు. ఇది తాను చెప్తున్న మాట కాదని, కంటివెలుగు తొలి విడత కార్యక్రమం ప్రారంభంలో ఎల్వీప్రసాద్ కంటి దవాఖాన వ్యవస్థాపకుడు డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వర్రావు చెప్పిన మాటని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 12 అత్యాధునిక పాకో యంత్రాలను బుధవారం ఆయన మంత్రి మహమూద్ అలీ, స్థానిక ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, సరోజిని కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగంతో కలిసి వర్చువల్‌గా ప్రారంభించారు.
సరోజిని కంటి దవాఖానలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. కంటి సమస్యలతో బాధపడుతున్న పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. కాటరాక్ట్ సర్జరీల నిర్వహణలో పాకో యంత్రాలు ఎంతో ఉపయోగపడతాయని, అల్ట్రా సౌండ్ సాంకేతికతతో పనిచేసే ఈ యంత్రాలతో సర్జరీలను సులభంగా, వేగంగా చేసేందుకు వీలుంటుందని వివరించారు. ఇప్పటివరకు పాకో యంత్రాలు సరోజిని దవాఖానలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని, అవి చాలకపోవడం వల్ల రూ.3.5 కోట్ల వ్యయంతో 12 పాకో యంత్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. వీటిలో రెండింటిని సరోజిని దవాఖానకు కేటాయించామని, మిగిలినవాటిని మలక్‌పేట ఏరియా దవాఖానతోపాటు మహబూబ్‌నగర్, వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, వికారాబాద్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు.
ఉచితంగా రూ.40 వేల సర్జరీ
ప్రైవేటు దవాఖానలో పాకో యంత్రం ద్వారా శస్త్రచికిత్స చేయాలంటే రూ.40 వేల వరకు ఖర్చవుతుందని, అంతటి ఖరీదైన సర్జరీలను ఇక నుంచి నిరుపేదలకు ఉచితంగా నిర్వహించనున్నామని హరీశ్‌రావు తెలిపారు. ఈ సర్జరీల నిర్వహణ కోసం వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించామన్నారు.
ప్రజల వద్దకే దవాఖాన
కంటి వెలుగు ద్వారా దవాఖాననే ప్రజల వద్దకు తీసుకెళ్తున్నామని, వైద్య సిబ్బంది నేరుగా గ్రామాల్లోకే వెళ్లి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. రెండో విడత కంటి వెలుగులో ఉచితంగా 40.59 లక్షల మందికి కండ్లద్దాలు, మరో 18.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ పంపిణీ చేశామని వివరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
Section 22A | కదలని 22ఏ ఫైళ్లు.. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోనే మూలుగుతున్న దరఖాస్తులు
Prabhas | బాక్సాఫీస్ నుంచి గ్లోబల్ మార్కెట్ వరకు.. ప్రభాస్ క్రేజ్‌కు ఇదే నిదర్శనం!
Bhu Bharati | సర్వర్ డౌన్.. ఓటీపీలు రావు.. భూ భారతి సేవలతో రైతుల అవస్థలు
Graduate Voter Registration | ఓటు నమోదులో వెనుకబడ్డ పట్టభద్రులు.. ఆన్లైన్లో అవకాశమున్నా ఎందుకింత నిరాసక్తత?
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

