హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్‌లో 12 మంది నకిలీ వైద్యులు పట్టుబడ్డారు. టాస్క్‌ఫోర్స్ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో టాస్క్‌ఫోర్స్ డీసీపీ గైక్వా డ్ వైభవ్ రఘునాథ్ వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్‌లో ఈ దాడులు చేయగా అరెస్టయిన వారిలో అందరూ నర్సు లు, కాంపౌండర్లు, మెడికల్ షాపు యజమానులుగా పోలీసులు గుర్తించారు. అర్హత లేకు న్నా క్లినిక్‌లు ఏర్పాటు చేసి ప్రజలకు స్లైన్లు, ఇంజెక్షన్లు, మందులు ఇస్తున్నట్టు నిర్ధారించా రు. వారి నుంచి పెద్ద ఎత్తున స్లైన్ బాటిళ్లు, బీపీ పరికరాలు, సర్జికల్ పరికరాలు స్వాధీనం చేసుకున్నామని డీసీపీ చెప్పారు. ప్రజలు అ నుమానాస్పద క్లినిక్‌లు, నకిలీ వైద్యుల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అరెస్టయిన వారిలో రామహేఖర్రెడ్డి(శ్రీ ఆక్వాఫస్ట్ ఎయిడ్ సెంటర్), నాగజ్యోతి, రాగం సుధాకర్, రహమత్‌నగర్‌లో మిరుదొడ్డి భారతి(ఫస్ట్ ఎయిడ్ సెంటర్), వెంకటగిరిలో మరో క్లినిక్‌లో కాటిక మహేశ్‌రావు, పానుగంటి బాలనరసింహశ్రీ(సాయితిరుమల క్లినిక్), బోరబండ పీఎస్ పరిధిలోని గంగానగర్‌లో ఉన్న క్లినిక్‌లో మహ్మద్ అబ్దుల్ వలీ ఉన్నారు.
చిలుకలగూడకు చెంది న నీలగిరి ప్రసాద్(ఫ్యామిలీ క్లినిక్), నల్లగుట్టకు చెందిన ఆదన్ సంధానీ(సంధాని క్లినిక్), లోయర్ ట్యాంక్‌బండ్ రోడ్డులోని ఎంశ్రీనివాస్(సాయిరామ్ క్లినిక్), చిలకలగూడలోని వెస్లీ చర్చి సమీపంలో పెద్ద పాట్ల సదానంద్(సాయిరామ్ క్లినిక్), మాణికేశ్వర్‌నగర్‌లో చింతలూరి రమేశ్(సరోజిని పాలిక్లినిక్), శివరాత్రి లింగయ్య(సూర్య క్లినిక్) ఉన్నారు. దాడుల్లో జూబ్లీహిల్స్ జోన్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సీహెచ్ యుగేంధర్, ఎస్సైలు మహ్మద్ జాహెద్, జీ సందీప్‌రెడ్డి, డీ రవిరాజ్, సికింద్రాబాద్ జోన్‌కు చెందిన టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ జే రాజశేఖర్ పాల్గొన్నారు.