ఔషధం.. అందేంత దూరంలో!
రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్' (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నది.
- కొత్తగా 12 సెంట్రల్ మెడిసిన్ స్టోర్లు
- 43 కోట్లు ఖర్చు చేయనున్న రాష్ట్రం
- మందుల కోసం నిరీక్షణకు చెక్
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొత్తగా 12 ‘సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్’ (సీఎంఎస్) ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీటి కోసం మొత్తం రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నది. ఇందులో మొదటి విడుతగా ఈ సంవత్సరం ఆరు స్టోర్లు, వచ్చే ఏడాది మరో ఆరు స్టోర్లు అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో స్టోర్ ఏర్పాటుకు రూ.3.60 కోట్లు వెచ్చించనున్నది. ప్రస్తుతం హైదరాబాద్‌కు అనుబంధంగా ఉమ్మడి జిల్లాకు ఒకటి చొప్పున సీఎంఎస్‌లు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా దవాఖానలు, ఏరియా హాస్పిటళ్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలకు ఇక్కడి నుంచే ఔషధాలు సరఫరా అవుతున్నాయి. అయితే ప్రభుత్వం ఇటీవల ఔషధాల సంఖ్యను గణనీయంగా పెంచడం, నిల్వలకు సంబంధించి కఠిన మార్గదర్శకాలు రూపొందించడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతోపాటు ఉమ్మడి జిల్లా కేంద్రం నుంచి మారుమూల ప్రాంతాలకు దూరరాభారం కారణంగా ఆలస్యం అవుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మరో 12 సీఎంఎస్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి అందుబాటులోకి వస్తే దవాఖానల్లో మందుల కొరతకు పూర్తిగా చెక్ పడనున్నది. ఏవైనా మందులు అత్యవసరంగా కావాల్సి వస్తే వెంటనే సరఫరా చేసేందుకు అవకాశం కలుగనున్నది. సీఎంఎస్‌ల కోసం శాశ్వత భవనాలను నిర్మించనున్నారు.
మందుల కొరత రాకుండా..
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు పూర్తి ఉచితంగా వైద్యం అందాలని, సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి వెళ్లాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం. ఇందుకు తగిన మౌలిక వసతులు కల్పించాలని, ఆరోగ్య రంగాన్ని పటిష్ఠం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ఉన్నతాధికారులు విస్తృతంగా అధ్యయనం చేశారు. కొన్ని రకాల మందులు అందుబాటులో లేకపోవడంతో రోగులు బయట కొనుగోలు చేయాల్సి వస్తున్నదని గుర్తించారు. దీంతో ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా అందించే మందుల సంఖ్యను 720 నుంచి 843కు పెంచారు. ఇందులో ఈఎంల్ జాబితాలో 311, ఏఎంఎల్ జాబితాలో 532 మందులు ఉన్నాయి. దీంతోపాటు ప్రతి దవాఖానలో కచ్చితంగా మూడు నెలలకు సరిపడా మందులు నిల్వ (బఫర్ స్టాక్) ఉంచుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సెంట్రల్ మెడిసిన్ స్టోర్లపై ఒత్తిడి పెరిగి, సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్తగా 12 సీఎంఎస్‌లను ఏర్పాటు చేయనున్నది. దీంతో ఔషధాల సరఫరాలో ఇబ్బందులు పరిష్కారం కావడంతోపాటు అత్యవసర సమయంలో మందుల రవాణా వేగవంతం కానున్నది. నిరీక్షణకు చెక్ పడనున్నది.
ఈ ఏడాది ప్రారంభించేవి..:
సిద్దిపేట మెడికల్ కాలేజీ, వనపర్తి, మహబూబాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లా దవాఖానలు.
వచ్చే ఏడాది అందుబాటులోకి వచ్చేవి..:
సూర్యాపేట మెడికల్ కాలేజీ, నాగర్ కర్నూల్, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, గద్వాల జిల్లా దవాఖానలు, వికారాబాద్‌లోని ఏరియా హాస్పిటల్.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

