హైదరాబాద్ : హైదరాబాద్ నగరం మణికొండ ఫ్రెండ్స్ కాలనీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు శంషాబాద్ సీఐలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో మణికొండలోని మహమ్మద్ అక్తరు జమాకన్ అనే వ్యక్తి ఇంటిని సోదా చేయగా 110 గ్రాముల హెరాయిన్ లభించిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ వెల్లడించారు.
నిందితుడు బెంగాల్‌లోని మాల్దా నుంచి హెరాయిన్‌ను తీసుకువచ్చాడని వివరించారు. నిందితుడు అక్తర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఫక్రూద్దీన్, కానిస్టేబుళ్లు మల్లేశ్, గణేశ్ పాల్గొన్నారు.