ఈ ఫొటోలో ఉన్న ముసలావిడ పేరు సింగారం ఆండాలమ్మ(100).. ఎవర్నీ విడిచిపెట్టకుండా దాడి చేస్తున్న కరోనా మహమ్మారి ఈమెనూ ఆవహించింది. ఎంతోమంది వైరస్ తీవ్రతను తట్టుకోలేక మరణశయ్యపైకి చేరితే, ఈమె మాత్రం వందేండ్ల వయసులోనూ కరోనాను జయించింది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు చూసిన నాకు ఈ వైరస్ ఓ లెక్కా అన్నట్టు దాని అంతుచూసింది. స్వతహాగా ఆయుర్వేద డాక్టరైన ఆండాలమ్మ.. మానసిక ధైర్యమే అసలైన రోగనిరోధకశక్తి అని అంటున్నారు. ఈమెది హైదరాబాద్‌లో సరూర్‌నగర్‌లోని వికాస్‌నగర్. ఏడుగురు సంతానం. ఐదుగురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. – ఎల్బీనగర్