హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ప్రవేశాలకు నవంబర్ 24న కామన్ అడ్మిషన్ టెస్టు(క్యాట్)-2024 ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆదివారం క్యాట్ నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 13 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. జనవరి రెండో వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి. జనరల్ అభ్యర్థులకు రూ.2,500, ఎస్సీ, ఎస్టీలకు 1,250 రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ణయించారు. దరఖాస్తుదారుల ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఉండాలని తెలిపారు. వివరాలకు www. iimcat.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.
ఎస్జీటీలకు పదోన్నతులు కల్పించాలి: ఫోరం
హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయుల పదోన్నతుల్లో ఎస్జీటీలకు అన్యాయం జరిగిందని తెలంగాణ ఎస్జీటీ నాయకులు రామదాసు, అనిల్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటన పేర్కొన్నారు. 10వేల పీఎస్‌హెచ్‌ఎం కొత్త పోస్టులు మంజూరు చేసి, వాటిని పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు.