కరోనా పేషెంట్లకు ఉచిత ఐసోలేషన్ కేంద్రం ప్రారంభం..

వరంగల్: వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా బారిన పడిన పేదవారి కోసం సేవా భారతి,యూత్ ఫర్ సేవా సంయుక్తంగా “వర్చుస”సేవా సంస్థ హైదరాబాద్ సహకారంతో వరంగల్ హంటర్ రోడ్ లోని శ్రీ వ్యాస ఆవాసం లో ఏర్పాటు చేసిన 30 పడకల ఉచిత ఐసోలేషన్ కేంద్రాన్ని శనివారం ఆర్.ఎస్.ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాచం రమేష్ ప్రారంభించారు. ఇక్కడ ఉచిత వసతి, పౌష్టికాహార భోజనంతో పాటు మందులు అందజేయనున్నారు. ఈ కేంద్రంలో డాక్టర్ల పర్యవేక్షణ , అవసరమైన వైద్య పరికరాలు అందుబాటులో ఉంచారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల వారు, ఒకటి ,రెండు గదులలో అద్దెకుంటూ ఇబ్బంది పడుతున్న స్వల్ప లక్షణాలు కలిగిన 60 సంవత్సరాలలోపు కోవిడ్ పేషెంట్లు 7207416163 మొబైల్ నెంబర్ కి ఫోన్ చేసి ఈ కేంద్రంలో చేరవచ్చని తెలిపారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాలో సేవాభారతి ఇప్పటికే కోవిడ్ బారిన పడిన వారికి ఉచిత డాక్టర్ కన్సల్టేషన్ తో పాటు మందులు కూడా అందజేస్తున్నది. కోవిడ్ బారిన పడి మరణించిన పేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మామిండ్ల రాజు, ప్రముఖ వైద్యులు డాక్టర్ శివ సుబ్రమణ్యం, డాక్టర్ బందెల మోహన్ రావు ,యూత్ ఫర్ సేవా రీజినల్ మేనేజర్ భూక్యా నరేష్, గాయత్రి అసోసియేట్స్ అధినేత కిరణ్ రావు ,సేవాభారతి జిల్లా ప్రధాన కార్యదర్శి మేరుగు హనుమారెడ్డి, డాక్టర్ వీరారెడ్డి, కేర్ ఫార్మసీ అధినేత సుధీర్ ఆర్య, ఐటీసీ వేణు, అల్వాల బిక్షపతి, కడమంచి విగ్నేష్, వెంగళ సురేందర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

