దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు.
హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘రాబిన్ హుడ్'. వీరిద్దరు కలిసి గతంలో ‘భీష్మ’ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రాబిన్ హుడ్' రూపొందుతోంది.