Robin Hood | భారతీయులంతా నా సహోదరులంటున్న రాబిన్ హుడ్..
హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘రాబిన్ హుడ్'. వీరిద్దరు కలిసి గతంలో ‘భీష్మ’ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రాబిన్ హుడ్' రూపొందుతోంది.
Robin Hood | హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం ‘రాబిన్ హుడ్’. వీరిద్దరు కలిసి గతంలో ‘భీష్మ’ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ‘రాబిన్ హుడ్’ రూపొందుతోంది. శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా టైటిల్ రివీల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు మేకర్స్.
భారతీయులందరూ తన సోదరులు, సోదరీమణులుగా భావించి, వారి నుంచి డబ్బు దొంగిలించడానికి తనకు అన్ని హక్కులు ఉన్నాయని చెప్పే నితిన్ పాత్రను పరిచయం చేస్తూ రివీల్ చేసిన టైటిల్ గ్లింప్స్ ఆకట్టుకుంది. ‘డబ్బు చాలా చెడ్డది. రూపాయీ రూపాయీ నువ్వేం చేస్తావ్ అంటే.. అన్నదమ్ముల మధ్య, అక్కాచెల్లెళ్ల మధ్య చిచ్చు పెడతాను అంటది. అన్నట్టే చేసింది.
దేశమంత కుటుంబం నాది. ఆస్తులున్నోళ్లంతా నా అన్నదమ్ములు.. ఆభరణాలేసుకున్నోళ్లంతా నా అక్కాచెల్లెళ్లు. అవసరం కొద్దీ వాళ్ల జేబుల్లో చేతులు పెడితే.. ఫ్యామిలీ మెంబర్ అని కూడా చూడకుండా నా మీద కేసులు పెడుతున్నారు. అయినా నేను హర్ట్ అవ్వలేదు. ఎందుకంటే అయినవాళ్ల దగ్గర డబ్బులు తీయడం నా హక్కు. మై బేసిక్ రైట్.
బికాజ్ ఇండియా ఈజ్ మై కంట్రీ. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ అంటూ సాగే హ్యూమర్స్ డైలాగ్‌తో నితిన్ తనను తాను పరిచయం చేసుకోవడం ఆసక్తికరంగా ఉంది. రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు కెమెరా: సాయిరాం, సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రచన-దర్శకత్వం: వెంకీ కుడుముల.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ind vs Nz | వెల్లింగ్టన్ టెస్టులో భారత్ పరుగుల విధ్వంసం.. 9 వికెట్లు సాధిస్తే టీమిండియాదే గెలుపు
Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
మంచిర్యాలను కమ్మేసిన పొగమంచు.. తెల్లవారుజామున కనువిందు చేసిన ప్రకృతి అందాలు!
Parliament Session | కొనసాగింపా..శీతాకాలమా.. 100 రోజులు పూర్తయినా ప్రొరోగ్ కాని ఉభయ సభలు?
Delimitation Bill | ఒక్కో ఎంపీకి రూ.150 కోట్ల ఆఫర్.. డీలిమిటేషన్ బిల్లు ఆమోదానికి ప్రలోభాలు: సంజయ్ రౌత్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

