రాబిన్‌హుడ్ తరహా పాత్రలతో హీరోలు అలరించడం తెలిసిందే. ఇప్పుడు హీరో నితిన్ ఏకంగా ‘రాబిన్‌హుడ్’ అనే పేరుతో సినిమానే చేసేస్తున్నాడు. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం కీలక షెడ్యూల్ కేరళలోని మున్నార్‌లో పూర్తయింది. ముఖ్యమైన టాకీ పార్ట్‌తో పాటు నితిన్, ఇతర నటీనటులపై భారీ యాక్షన్ బ్లాక్‌ను కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించినట్లు మేకర్స్ తెలిపారు. త్వరలోనే తదుపరి షెడ్యూల్‌ను కూడా ప్రారంభించనున్నట్లు చెప్పారు. డా॥ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, రచన, దర్శకత్వం వెంకీ కుడుముల.