దర్శకుడు వెంకీ కుడుముల నిర్మాతగా మారారు. ‘ఇట్లు అర్జున’ పేరుతో ఓ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. అనీష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం ద్వారా మహేశ్ ఉప్పల దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. అనస్వరరాజన్ కథానాయిక. ప్రచార చిత్రాలు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఇచ్చిన పవర్ఫుల్ వాయిస్ ఓవర్ గ్లింప్స్ వల్ల ఆడియన్స్‌లో సినిమాపై ఆసక్తి పెరిగింది.
ప్రచారంలో భాగంగా ఈ నెల 28న ‘హాయ్ రే..’ అంటూ సాగే ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ని ఆదివారం విడుదల చేశారు. అనీష్, అనస్వర రాజన్ల మధ్య కనిపిస్తున్న సహజమైన కెమిస్ట్రీ ఈ పోస్టర్‌కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కిటికీ ఎక్కి కూర్చొని బుక్ చదువుతున్న అనస్వరనూ, ఆ కిటికీ పక్కనే బయటున్న అరుగుపై కూర్చొని ఆలోచనల్లో మునిగివున్న అనీష్నీ ఈ పోస్టర్లో చూడొచ్చు. తొలి ప్రేమలోని మధురానుభూతులని ఆవిష్కరించేలా ఈ పాట ఉండబోతున్నదని పోస్టర్ చెబుతున్నది.