పేద ప్రజల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే శానంపూడి

హుజూర్నగర్ టౌన్: పేద ఆడ బిడ్డల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబార్ పథకాలు ప్రవేశపెట్టారని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయంలో లబ్ధి దారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి భారీ మెజారిటీతో గెలిపించిన హుజూర్నగర్ ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నామన్నారు.
ప్రతిపక్షాలు కోర్టులో కేసులు వేస్తూ టెండర్లు పూర్తయిన పనులను అడ్డుకుని అధికారం కోసం పాకులాడుతున్నాయ న్నారు. రాజకీయాల్లో కాదు అభివృద్ధిలో పోటీ పడాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు గురవయ్య, ఉపేంద్ర, జడ్పీటీసీ సైదిరెడ్డి, తాసిల్దార్ జయశ్రీ, రెవెన్యూ సిబ్బంది, ఇతర టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

