పులిచింతల ప్రాజెక్టుకు భారీగా ఇన్‌ఫ్లో.. 17 గేట్లు ఎత్తివేత
పులిచింతల ప్రాజెక్టు | సూర్యాపేట-గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల జలాశయానికి వరద పొటెత్తుతున్నది.

హైదరాబాద్ : ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణానది పరివాహక ప్రాజెక్టులన్నీ నిండటంతో వచ్చిన వరదను వచ్చినట్లు క్రస్టుగేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సూర్యాపేట-గుంటూరు జిల్లాల సరిహద్దులోని పులిచింతల జలాశయానికి వరద పొటెత్తుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.23 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులిచింతల ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తి 3 లక్షల 47వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కోసం 8వేల క్యూసెక్కులను కేటాయించారు. రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 41.38 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండటం, గేట్లు ఎత్తడంతో దిగువ ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. పులిచింతల క్రస్టుగేట్లు ఎత్తడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది.
Read Today's Latest Suryapet News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

