సోమవారం 18 జనవరి 2021
Suryapet - Nov 24, 2020 , 01:31:21

అభివృద్ధి పనులను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారి

అభివృద్ధి పనులను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారి

సూర్యాపేట రూరల్‌ : మండలంలోని ఆరెగూడెం, రామచంద్రాపురం గ్రామ పంచాయతీలను రాష్ట్ర ఫ్లైయింగ్‌ స్కాడ్‌, విజిలెన్స్‌ అధికారి రామకృష్ణ సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పంచాయతీల్లో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు.  అంగన్‌వాడీ, ఆరోగ్య కేంద్రం, ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డులను తనిఖీ చేశారు. రికార్డులు సరిగా నిర్వహించడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామపంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థ ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, సర్పంచులు పులగం స్వాతి, వేణుగోపాల్‌రెడ్డి, ఈసీ రమేశ్‌, కార్యదర్శులు ఉమ, నిఖిల తదితరులు పాల్గొన్నారు.