కొత్త పెట్టుబడులకు ప్రయత్నిస్తారు. నూతన నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారులు సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. కొత్త ఒప్పందాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితుల ద్వారా పెండింగ్ సమస్యలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఆరోగ్యంగా ఉంటారు. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
రోజువారీ లావాదేవీలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థులకు మంచి కాలం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. అధికారులతో స్నేహంగా ఉంటారు. స్నేహితుల సహకారం లభిస్తుంది. భూమి, వాహనం కొనుగోలు చేస్తారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. ఖర్చులు ఉన్నప్పటికీ, అందుకు తగ్గ రాబడి ఉంటుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.
నూతన ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. వ్యాపారులకు అదృష్టం కలిసివస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. వాటిని సమర్థంగా నిర్వర్తిస్తారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంటుంది. గురు గ్రహ ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలు సాధించగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. శివాలయాన్ని సందర్శించండి.
కార్య నిర్వహణపై శ్రద్ధ చూపడం అవసరం. సమయానికి తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకొని, వాటిని కచ్చితంగా అమలు చేస్తారు. ఉద్యోగులు అప్రమత్తంగా ఉండటం అవసరం. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆర్థికంగా హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇచ్చిన డబ్బు చేతికి రావడంలో ఇబ్బందులు ఎదురవ్వొచ్చు.శుభకార్య ప్రయత్నాల్లో అందరి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. అధికారులతో స్నేహంగా ఉంటారు. హనుమాన్ చాలీసా పఠించండి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్య సాఫల్యం ఉంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరతారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతాయి. విద్యార్థులకు మంచి సమయం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.
నూతన ఉద్యోగ యోగం ఉంది. మంచి సంస్థ నుంచి పిలుపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కార్య సాఫల్యం ఉంది. రాబడి మార్గాలు పెరుగుతాయి. ఖర్చులు అధికమవుతాయి. వ్యాపారులకు మిశ్రమ కాలం. కొత్త ప్రయత్నాలు కొన్నాళ్లు వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి.
ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయమూ పెరుగుతుంది. వ్యాపార లావాదేవీలు సక్రమంగా సాగుతాయి. గతంతో పోలిస్తే జీవనశైలిలో మంచి మార్పు కనిపిస్తుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సోదరులతో ఉన్న ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కుదురుతుంది. జీవిత భాగస్వామి సలహాలు పాటిస్తారు. రామాలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. భూ లావాదేవీల్లో వివాదాలు తలెత్తవచ్చు. సహోద్యోగులతో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ఆస్తి తగాదాలు పాక్షికంగా పరిష్కారం అవుతాయి. శివారాధన మేలు చేస్తుంది.
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులకు శ్రమ అధికమవుతుంది. అందుకు తగ్గ ఫలితాలు సాధిస్తారు. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. ఖర్చుల నియంత్రణ ఈ వారం అవసరం. రోజువారీ లావాదేవీలు సజావుగా సాగుతాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన కుదురుతుంది. ఆదాయంలో హెచ్చుతగ్గుల కారణంగా కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. లక్ష్మీధ్యానం శుభప్రదం.
ఉద్యోగులకు మంచి ఆదరణ లభిస్తుంది. సహోద్యోగుల సహకారం పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. గతంతో పోలిస్తే మంచి కాలం. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ, సమయానికి డబ్బు చేతికి అందుతుంది. పిల్లలు చదువులో రాణిస్తారు. భూ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.
ఇంటా, బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు పెరుగుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి చేతికి అందడంలో ఆలస్యం అవుతుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. కొత్త పరిచయాలతో కార్య సాఫల్యం ఉంది. తీర్థయాత్రలకు వెళ్తారు. విందు, వినోదాలకు హాజరవుతారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నలుగురికి ఉపయోగపడే పనులు చేస్తారు. కొత్త పరిచయాలతో జాగ్రత్త అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగులకు అదృష్టం కలిసివస్తుంది. అధికారుల మన్ననలు అందుకుంటారు. పెద్దల సలహాలు పాటించడం అవసరం. వివాదాలకు దూరంగా ఉంటే మంచిది. ఇష్టదైవాన్ని ఆరాధించండి.
-గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల్ పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్. సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in