హెల్త్ బిట్స్
ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థం చేర్చుకోవాలని అనుకుంటున్నారా? దీనికి ఐరన్, విటమిన్లతో నిండిన పిస్తాపప్పు మంచి పరిష్కారం. ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం లేదు.
పిస్తా.. మస్త్ స్నాక్
ఆహారంలో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉన్న పదార్థం చేర్చుకోవాలని అనుకుంటున్నారా? దీనికి ఐరన్, విటమిన్లతో నిండిన పిస్తాపప్పు మంచి పరిష్కారం. ఇతర గింజలతో పోలిస్తే పిస్తాలో తక్కువ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి బరువు పెరుగుతామనే భయం లేదు. ఫలహారం కోసం నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
కౌమారమే మూలం
కౌమారంలో పిల్లలు గుండె, ఊపిరితిత్తుల విషయంలో ఫిట్గా ఉంటే మాత్రం.. వాళ్లకు 57 64 ఏండ్ల వయసులో కూడా గుండె సమస్యల ముప్పు తక్కువని చెబుతున్నారు నిపుణులు. ఈ విషయం ఫిన్లాండ్లోని జైవాస్కైలా విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. అధ్యయనం కోసం 12 నుంచి 19 ఏండ్ల కౌమారుల ఆరోగ్య సమాచారాన్ని తీసుకున్నారు. వీరంతా 37 నుంచి 44 మధ్య వయస్కులు అయిన తర్వాత ఒకసారి, ఆ తర్వాత చివరగా 57 64 ఏండ్లకు చేరుకున్నాక ఒకసారి.. గుండె పనితీరును అధ్యయనం చేశారు. ఈ వివరాల ఆధారంగా మలిసంధ్యలో గుండె ఆరోగ్యానికి చిన్నవయసులో దృఢంగా ఉండటమే
కీలకమని నిర్ధారించారు.
చర్మానికి పోషకాల చికిత్స
చర్మాన్ని సున్నితంగా చేసే మంచి క్రీము కోసం చూస్తున్నారా? అయితే, ‘మల్టీనట్ షియా ఒమేగా 3 స్కిన్ మలాయ్ క్రీమ్’ బాగుంటుంది. ఇది 48 గంటలపాటు చర్మానికి రక్షణనిస్తుంది. 100 శాతం గ్లిజరిన్ లేనిది. చర్మంపై మొటిమలను తొలగిస్తుంది. మచ్చలు, కమిలిన మరకలు, పొలుసుల మరమ్మతుకు కూడా ఉపకరిస్తుంది. ఇందులో పచ్చిపాలు, షియా, వాల్నట్స్, బాదం, కొబ్బరి, నువ్వులు, పొద్దు తిరుగుడు గింజలు, ఆలివ్ క్రీమ్ ప్రధాన దినుసులు. మీరూ తయారు చేసుకోవచ్చు.
సాన్నిహిత్యంతో ఉపశమనం
మనోవ్యధను ఎక్కువ కాలం అనుభవించలేం. అయితే, సన్నిహితుల మధ్య గడపటం వల్ల ఆ బాధ కొంత ఉపశమించినట్టు అనిపిస్తుందట. మనకేదైనా కష్టం వస్తే నలుగురూ ఉన్నారనే భావన వల్ల ఆందోళన తగ్గడమే దీనికి కారణం. ఇందుకు
సంబంధించిన పరిశోధన ‘ఎమోషన్’
జర్నల్లో ప్రచురితమైంది. కాలిఫోర్నియాకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. సన్నిహితులతో కూడా బాధ తగ్గకపోతే.. మందపాటి దుప్పటి కప్పుకొని పడుకున్నా మంచి ఫలితాలే ఉంటాయట. ఇలా చేయడం వల్ల మనం భద్రంగా ఉన్నామనే భావన కలుగుతుందట.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

